Boduppal : ఆధునిక పెళ్లిళ్లు చాలావరకు నాలుగు రోజులకే పెటాకులుగా మారుతున్నాయి. అనుమానాలతో కొందరు అదనపు కట్నం కోసం మరికొందరు కట్టుకున్న నాలుగు రోజులకు హతమారుస్తున్నారు. ఇవేవీ కాకపోతే వివాహేతర(Extramarital) సంబంధాలతో చంపుతున్నారు. మనదేశ వివాహవ్యవస్థ ప్రపంచదేశాలకు ఎందో ఆదర్శం. అలాంటి గొప్ప బంధాలు నేడు చిన్నచిన్న కారణాలతో విడాకులు తీసుకోవడం లేదా హత్యలకు పాల్పడడం చేస్తున్నారు. తాజాగా ఓ భర్త కట్టుకున్న ఇల్లాలిని గర్భవతి అని కూడా కనికరం లేకుండా ఆమెను చంపాడు. అంతటితో ఆగకుండా తల మెండం వేరుచేసి, మూసినదిలో పడేశాడు.
పోలీసులు అదుపులో భర్త
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్(Medchal) బోడుప్పల్కి చెందిన వివాహిత స్వాతి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కట్టుకున్న భర్తే భార్యను చంపి, ఆపై రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లుగా శరీర భాగాలను మూసినదిలో పడేశాడు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే పోలీసులు స్వాతి శరీర భాగాల కోసం మూసినదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గత 24 గంటలుగా మూసీలో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
గాంధీ మార్చిరీలో స్వాతీ మొండెం
మూసీనదిలో దాదాపు 10కిలో మీటర్ల వరకు వెతికినా మృతదేహపు ఇతర శరీర భాగాలు లభ్యం కాలేదని పోలీసులు చెప్పారు. బహుశా అవి వరదలో కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం స్వాతి మొండెం మాత్రమే గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉందని తెలిపారు. ఈ కేసులో నిందితుడైన స్వాతి భర్త మహేందర్ని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా తరలించారు.
ఈ కేసులో బాధితురాలు ఎవరు?
బాధితురాలు స్వాతి. ఆమె గర్భిణీ అయినప్పటికీ, భర్త ఆమెను హత్య చేశాడు.
హత్య చేసిన తర్వాత నిందితుడు ఏమి చేశాడు?
భార్యను చంపిన తర్వాత, రంపంతో శరీరాన్ని ముక్కలు చేసి, ఆ ముక్కలను మూసీ నదిలో పడేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: