📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

News Telugu: Telangana: పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం

Author Icon By Rajitha
Updated: October 16, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(Telangana) : పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదించగానే ట్రిపులార్ కు టెండర్లు ఉత్తర భాగంలో పనులకు నవంబరులో టెండర్ ప్రక్రియ హైదరాబాద్.: రీజినల్ రింగురోడ్డు (Ring Road) ఉత్తర భాగం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదించగానే నిర్మాణ సంస్థల కోసం ప్రభుత్వం నవంబర్ టెండర్ ప్రకటన వేసేందుకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రీజినల్ రింగ్ రోడ్డుకు 161ఎఎ నెంబరు కూడా తొలగించి కొత్త నెంబరు ఏర్పాటు చేసే దిశగా జాతీయ రహదారుల విభాగం కూడా యోచిస్తున్నది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ ఆమోదించడంతో రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి కీలక పురోగతి చోటుచేసుకుంది. ప్రధాన జాతీయ రహదారి (National highway) ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సంబంధమైన సాధ్యాసాధ్యాలను అంచనా వేసి పరిశీలించి లోపాలను ఎత్తిచూపి వాటిని సరిదిద్దిన తర్వాత ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ ఆమోదముద్ర వేయడంతో ఒక కీలక ఘట్టం ముగిసింది. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం సాంకేతిక, ఆర్థిక పరమైన అంశాల అప్రైజల్ను పూర్తి చేసుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదముద్రకు వెళ్లింది. త్వరలో ఆ కమిటీ కూడా సమావేశమై దీనికి తుది అనుమతి ఇవ్వనుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదముద్ర లభిస్తుంది. దానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ పచ్చజెండా ఊపుతుంది.

BC Bandh : బీసీ సంఘాలు బంద్ కు మద్దతు తెలిపిన BRS, BJP

ఆ వెంటనే టెండర్లు తెరిచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. నవంబరులో ఉత్తర భాగం టెండర్లను తెరవనున్నారు. త్రిపులార్ రోడ్కు ఇచ్చిన 161ఎఎ నెంబరు పై గందరగోళం నెలకొంది. ఎన్హెచ్ 161 ఎఎ నేషనల్ ఎక్స్ ప్రెస్ వే గానే రికార్డుల్లో ఉంటుంది. ప్రస్తుతం ఆ నంబరును సంగారెడ్డి నుంచి తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఉన్న రోడ్డుకు ఉంది. గతంలో రాష్ట్ర రహదారిగా ఉన్న ఆ రోడ్డును రీజినల్ రింగురోడ్డు ప్రతిపాదన సమయంలో జాతీయ రహదారిగా గుర్తించారు. అప్పట్లో ఆ రోడ్డును రీజినల్ రింగురోడ్డులో భాగంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉండేది. కానీ, దాన్ని ఎక్స్ప్రెస్ వేగా నిర్మించాలని నిర్ణయించటంతో, ఉన్న పాత రోడ్డు బదులు గ్రీన్ఫీల్డ్ రోడ్డుగా నిర్మించాలని ఆ తర్వాత నిర్ణయించారు. ఫలితంగా ఆ రోడ్డు దీనికి సమాంతరంగా కొనసాగనుంది. అయితే రీజినల్ రింగురోడ్డు జాతీయ రహదారి ఎక్స్ప్రెస్ వే రూపుదిద్దుకోనున్నందున, దానికి సమాంతరంగా కొనసాగే పాత రోడ్డును జాతీయ రహదారి హోదా తొలగించి 389 రాష్ట్ర రహదారిగా మార్చనున్నారు. అప్పుడు దానికి 161 ఏఏ నంబరు తొలగిపోతుంది. Telangana దాని నిర్వహణ పూర్తిగా రాష్ట్రప్రభుత్వ అధీనంలోని ఆర్అండ్ బి పరిధిలోకి చేరుతుంది. ఇప్పటికే 161 నంబరుతో ప్రధాన జాతీయ రహదారి, 161 ఏ నెంబరుతో మరో రోడ్డు ఉన్నందున 161 ఏఏ నంబరు ఏర్పడింది. మూడు రోడ్లకు అదే నంబరు ఉండనున్నందున అయోమయం లేకుండా రీజినల్ రింగురోడ్డుకు కొత్త నంబరు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అప్పటివరకు 161 ఏఏతోనే రీజినల్ రింగురోడ్డు కొనసాగనుంది.

రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కానుంది?
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం లభించిన వెంటనే నవంబరులో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం ప్రాజెక్ట్‌లో తాజా పురోగతి ఏమిటి?
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ ఆమోదం లభించడం ద్వారా ప్రాజెక్ట్‌లో కీలక పురోగతి సాధించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

latest news NH 161AA regional ring road road tenders Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.