నిన్నటి వరకు ఎటిఎంల లూటీ
Telangana Police: : రాష్ట్రంలో ఎటిఎంలను ఉత్తరాది నేరగాళ్లు టార్గెట్ చేస్తున్న వైనం
పోలీసులకు సవాల్ గా మారింది. నిన్నటి వరకు జనావాసానికి దూరంగా వుండే ఎటిఎంబరు లూటీ చేసిన నేరగాళ్లు ఇప్పుడు పట్టపగలు ఎటిఎంలలో నగదు నింపేందుకు వచ్చే సిబ్బందితో పాటు ఎటిఎంలలో నగదు డిపాజిట్ చేసే వారిపై జనం చూస్తుండగానే కాల్పులు జరుపుతూ దోపిడీలకు పాల్పడుతున్న తీరు పోలీసులను సైతం నివ్వెర పరుస్తోంది. శనివారం ఉదయం కోఠిలోని బ్యాంక్ స్ట్రీట్ వద్ద గల ఎటిఎంలో ఆరు లక్షల రూపాయలను డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యాపారపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి మొత్తం నగదును దోచుకుని రెప్పపాటులో ఉడాయించారు.
Read Also: HYD Crime: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?
ఎటిఎంల వద్ద నేరాలను నివారించేందుకు సిసి టివిలను సమీప పోలీసు స్టేషన్లకు అనుసంధానించాలనే ప్రతిపాదన ఏళ్ల తరబడి వున్నా ఆదరణలో పూర్తిగా అమలు కావడం లేదు. ఎటిఎంలు ప్రజలకు ఎనీ టైం మనీ ఇచ్చేదిలా కాకుండా దొంగలకు ఎనీ టైం దోపిడి చేసేందుకు వీలుగా మారుతున్నాయి. గతంతో పోలిస్తే ఇటీ వల కాలంలో ఎటిఎంలను దుండగులు దోచుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయని చెప్పాలి. దేశంలోని ఇతర రాష్టాలతో పోలిస్తే నగదు చలామణి ఎక్కువగా వుండే దక్షిణాని రాష్ట్రాలలోనే ఎటిఎంల బూటీ, ఎటిఎంలలో నగదు జమా చేసేందుకు వచ్చే సిబ్బందిపై దాడులు ఇరిపి దోపిడీలు వేస్తున్న ఉదంతాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జాతీయ క్రైం రికార్డు బ్యూరోలోని గణాంకాలు ఈ విషయాలు తేటతెల్లం చేస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాలలో ప్రతీ ఏటా 50 వరకు ఎటిఎంల లూటీ లేదా అక్కడి ఉద్యోగులపై దాడిచేసి నగదు దోపిడి ఘటనలు(Robbery incidents) జరుగుతున్నాయంటే వీటిపై నేర గాళ్ల పంజా ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. తెలంగాణ వరకే వస్తే నిజామాబాద్లో గడచిన ఆరు నెలల కాలంలో నాలుగు ఎటిఎంలను చేరగాళ్లు కొల్లగొట్టారు. ఈ కేసుల్లో నిందితులు ఇప్పటి వరకు పట్టుబడలేదు. ఇదే సమయంలో గత ఏడాది తెలంగాణలో పదికి పైగా ఎటిఎం రోరీలు జరగగా ఇందులో కొని ఇంటిని దుండగులు ఏకంగా పెకిలించి ఎత్తుకెళ్లారు. ఈ నేరాలన్నీ బీహార్తో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నేరగాళ్లే కారణమని పోలీసులు చెబుతున్నారు. గతంలో గజ్వేల్తో పాటు పూర్వపు రాచకొండ పరిధిలో జరిగిన ఎటిఎం చోరీలు ఆయా ప్రాంతాల్లో కలకలం. ఏడేళ్ల క్రితం సంగా రెడ్డి జిల్లాలో మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా పెట్రోల్ బంకులతో పాటు రక్షణ తక్కువగా వున్న నాలుగు ఎటిఎం లను ధ్వంసం చేసి 50 లక్షల రూపాయలకు పైగా నగలను దోచుకున్న తీరు అప్పట్లో సంచలనం రేపింది.
ఈ దోపిడీలకు పాల్పడ్డ దుండగులలో కొందరు పట్టుబడినా చోరికి గురైన నగదులో కొంతమేరకే లభించింది. 2021 ఏప్రిల్ నెలలో కూకట్పల్లిలోని ఫలెలకుంట పార్క్ వద్ద జనం వున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు నేరగాళ్లు హెల్దీ ఎఫ్సీ ఎటిఎంలో నగమ నింపుతున్న ఉద్యోగులపై కాల్పులు జరిపి ఐదు లక్షల రూపాయలను లూటీ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పో లిస్తే నగదు చలామణి దక్షిణాది రాష్టాలలో ఎక్కువగా వుండడం ఎటిఎంల దోపిడీ, లూటీలకు ప్రధాన కారణంగా పోలీసులు దెబుతున్నారు. తాజాగా శనివారం కోఠి బ్యాంక్ స్ట్రీట్లో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యాపారిపై కాల్పులు జరిపి ఆరు లక్షల రూపాయలను దుండగులు దోచుకున్నారు. ఈ దోపిడికి బీహార్ నేరగాళ్లు కారణమని భావిస్తున్నారు. ఎటిఎంలను దుండగులు పక్కా పథకంతో దోచుకుంటున్న తీరు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎటిఎంలపై జరుగుతున్న దాడులు, దోపిడీల ఉదంతాలు అక్కడ వున్న భద్రత డొల్లగా వుందని తేటతెల్లం చేస్తోంది.
సిసిటీవిలను పోలీసు స్టేషన్లతో అనుసంధానిస్తే…
ఇదిలా ఉండగా రాష్ట్రంలో వున్న 20 వేలకు పైగా వున్నాయి. రాష్ట్రంలోని ఎటిఎంల వరకు వస్తే దాదావు అన్నింటి వద్ద సిసిటివిలు వున్నాయి. వీటిని ఆయా బ్యాంకులకు అనుసంధానం చేస్తున్నా వీటివల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. దీనికి బదులు ఆయా ప్రాంతాల పోలీసు స్టేషన్లు లేదా ఒమ్మీ పోలీసు వ్యవస్థతో అనుసంధానం చేస్తే నేరగాళ్ల భరతం పట్టేందుకు వీలుంటుందని పోలీసు అధికారులంటున్నారు. ప్రస్తుతం అన్ని పోలీసు స్టేషన్ పరిధుల్లో వేల సంఖ్యలో సిసిటివిలు వుండగా వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు స్టేషన్లలో ప్రత్యేకించి వ్యవస్థ వుంది. ప్రతి క్షణం అన్ని కెమెరాలను గమనించే సిబ్బంది వుంటారు. ఈ క్రమంలోనే అనేక నేరాలకు సంబంధించి నేరగాళ్లు సులభంగా దొరికిపోతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: