📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Strike – 87శాతం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు సమ్మెకు దూరం

Author Icon By Rajitha
Updated: September 18, 2025 • 10:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీ.ఏ.ఎన్.హెచ్.ఏ) (TANHA) ప్రకటించినా వైద్య సేవలపై ఆ ప్రభావం పడలేదు. రాష్ట్రంలో చాలా నెట్వర్క్ హాస్పిటల్స్లో యథావరిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగాయి, ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా మట్టుకు సమ్మెకు (Strike) దూరంగా ఉన్నాయి. బుధవారం ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్య సేవలు అందించిన హాస్పిటల్స్ 87 శాతంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కేవలం 13 శాతం హాస్పిటళ్లలోనే వైద్య సేవలు ఆగినట్లు సమాచారం. అయినప్పటికీ వైద్య సేవలు సాగించాలని ఆయా హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ (CEO Uday Kumar) మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత రెండు వారాలుగా సగటున రోజూ 844 సర్జరీలు నమోదవగా… ఒక్క బుధవారం నాడే 799 సర్జరేలు అనమోదు అయ్యాయని ఆరోగ్యశ్రీ వర్గాలు వెల్లడించాయి.


దామోదర్ రాజనర్సింహ మండి పడ్డారు

మరోవైపు టీ.ఏ.ఎన్.హెచ్.ఏ వైద్య సేవలకు దూరంగా ఉంటామని ప్రకటించిన తరుణంలో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ దవాఖానలో మరింత పకర్బందీగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 477 ప్రైవేటు హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తుండగా… కేవలం 62 హాస్పిటల్స్ మాత్రమే సేవలు బండ్ చేశాయని 415 హాస్పిటల్స్ లో సేవలు యధావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకానికి కనీసం రూ.50 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని… కానీ తాము నెలకు రూ.100 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపినా సమ్మె (Strike) చేయడమేంటని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) మండి పడ్డారు. బుధవారం అమీర్పేట పిహెచ్సీలో జరిగిన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Strike

గతంలో తక్కువ ధరకే సేవలు అందించిన నెట్వర్క్

గత తొమ్మిదన్నర ఏళ్లలో చేయని సమ్మె (Strike) ఇప్పుడు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు తాము ఎంతో కమిట్మెంట్ తో కృషి చేస్తున్నామని తెలిపారు. తాము ఆరోగ్యశ్రీలో కొత్తగా 163 ప్రొసీజర్స్ తీసుకురావడంతో పాటు ధరలను రెవైజ్ చేయడంతో సుమారు రూ.487 కోట్ల భారం ప్రభుత్వంపై పడిందన్నారు. ప్రస్తుతం 1365 ప్రొసీజర్స్ ద్వారా తాము వైద్యం అందిస్తున్నామన్నారు. గతంలో ఇప్పటికీ ఆరోగ్యశ్రీ చెల్లింపుల అంశంలో లేదా గమనించాలని కోరారు. ఇప్పటికే ఈ నెలకు అవసరమైన రూ.100 కోట్లను తాము విడుదల చేశామని… ఇప్పటికైనా సమ్మె విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో తక్కువ ధరకే సేవలు అందించిన నెట్వర్క్ హాస్పిటల్స్. తాము ధరలు పెంచినందుకు స్ట్రైక్ చేస్తున్నారా అని నిలదీశారు. ఇప్పటికైనా పేదలకు వైద్య సేవలు అందించేందుకు నెట్వర్క్ హాస్పిటల్స్ ముందుకు రావాలని ఆయన కోరారు. వైద్య సేవలు ఆగే పరిస్థితి ఉండబోదని స్పష్టం చేశారు..

టీ.ఏ.ఎన్.హెచ్.ఏ ప్రకటించిన సమ్మె రాష్ట్రంలోని వైద్య సేవలపై ఎంత ప్రభావం చూపింది?
పెద్దగా ప్రభావం చూపలేదు. రాష్ట్రంలోని 87% ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్య సేవలు కొనసాగించాయి.

సమ్మెలో పాల్గొన్న హాస్పిటల్స్ శాతం ఎంత?
A2: కేవలం 13% హాస్పిటల్స్ మాత్రమే సమ్మెలో పాల్గొన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/use-of-artificial-intelligence-in-the-electrical-sector/telangana/549500/

Aarogyasri scheme Breaking News corporate hospitals HealthCare latest news medical services private hospitals strike Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.