📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Sitakka – వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడికి లోనవుతున్న మహిళలు: మంత్రి సీతక్క

Author Icon By Rajitha
Updated: September 17, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : మహిళలకు ఎన్నో సవాళ్లు ఉన్నాప్రభుత్వ ఉద్యోగంలో రాణిస్తున్నారని మంత్రి సీతక్క (Sitakka) అన్నారు. మంగళవారం సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులుగా ఎన్నికైన మహిళలచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళకు ఉద్యోగం (job) అంటేనే అదనపు బాధ్యత ఒకవైపు కుటుంబ బాధ్యతలు మరొకవైపు వృత్తి బాధ్యతలు. రెండిటిని ఏకకాలంలో నెరవేర్చుతున్న మహిళా ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. కుటుంబ బాధ్యతలు, వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడిలకు లోను అవుతుంటారు కానీ ఆ ఒత్తిడిలను అధిగమించి రాణిస్తున్న మహిళలు తమ ఆరోగ్యాన్ని
పట్టించుకోకుండా ఫ్యామిలీ భారాన్ని మోస్తూ ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. (Sitakka) భర్త సహకారం ఉన్న మహిళా ఉద్యోగులు అదృష్టవంతులు అత్తమామలు, భర్త, పిల్లల బాధ్యతలు సునాయాసంగా మోయగలరన్నారు.

Sitakka

భూదేవికి ఉన్నంత ఓపిక

భూదేవికి ఉన్నంత ఓపిక మహిళలకు ఉన్నందున కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాలను చర్చించేందుకు ఈనెల 22న రౌండ్ టేబుల్ (Round Table) సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి మహిళ ఉద్యోగులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చే అభిప్రాయాలను బట్టి నూతన పాలసీ తీసుకొస్తామని, ఉచిత బస్సు (Free bus) ప్రయాణం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మహిళల ప్రతిభను బయటికి రాకుండా చేసేందుకు గొడవలను భూతద్దంలో పెట్టి చూయిస్తున్నారన్న మంత్రి సీతక్క మహిళలు ఐక్యత సాధిస్తే అన్ని సాధించినట్లు తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాలు అద్భు తాలు సృష్టిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్ బంకుల ఏర్పాటు ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని మహిళా ఉద్యోగులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా మాతో చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వ గౌరవాన్ని కాపాడే విధంగా మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.

మంత్రి సీతక్క ఏమన్నారు?
మహిళలకు వృత్తి, కుటుంబ బాధ్యతలు రెండూ ఉండి, దాంతో ఒత్తిడి వస్తున్నప్పటికీ వారు రాణిస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు.

మహిళలకు ప్రధాన సవాళ్లు ఏమిటి?
కుటుంబ బాధ్యతలు, వృత్తి బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/atchannaidu-jagans-crocodile-tears-for-farmers/andhra-pradesh/548734/

Breaking News family responsibilities job stress latest news Seethakka telangana government Telugu News Women Empowerment working women

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.