📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Rapido:హెచ్‌పీసీఎల్‌తో ర్యాపిడో ఒప్పందం

Author Icon By Anusha
Updated: July 25, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో రవాణా సేవల పరంగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నగర వాసుల అభిరుచులు, మారుతుండటంతో బైక్ టాక్సీలకు డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ర్యాపిడో (Rapido) సంస్థ తన అగ్రస్థానాన్ని మరింత బలపర్చుకుంటోంది. 2015లో ప్రారంభమైన ఈ స్టార్టప్‌.. నగర రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి బైక్ టాక్సీ సేవలను ప్రారంభించిన ఘనత ర్యాపిడోకే దక్కుతుంది.ఇప్పుడు ఈ సంస్థ 75 మిలియన్ల మందికి పైగా వినియోగదారుల్ని కలిగి ఉంది. 500కు పైగా నగరాల్లో తమ సేవలు విస్తరించగా, ఇప్పటివరకు ఒక బిలియన్ రైడ్‌లను పూర్తి చేసినట్లు ర్యాపిడో అధికారికంగా ప్రకటించింది. ఈ సంఖ్య ర్యాపిడో సామర్థ్యాన్ని, ప్రజలపై దీని ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

హైదరాబాద్‌ అగ్రస్థానం

హైదరాబాద్‌లో మాత్రమే రోజుకు సగటున 1.5 లక్షల రైడ్‌లను నిర్వహిస్తూ ర్యాపిడో తన శక్తిని చాటుతోంది. 2024 జనవరి నివేదికల ప్రకారం, నగరంలోని క్యాబ్ సేవల మార్కెట్‌లో ఈ సంస్థ దాదాపు 25 శాతం వాటాను ఆక్రమించుకుంది. ఈ స్థాయిలో వృద్ధి సాధించడం ఒక స్టార్టప్‌కి చాలా గర్వకారణం.ర్యాపిడో బైక్ టాక్సీ సేవలకే పరిమితం కాకుండా ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రయాణికులు మెట్రో టికెట్లను ర్యాపిడో యాప్ ద్వారానే బుక్ చేసుకునే అవకాశం పొందుతున్నారు.ప్రథమ మెట్రో టికెట్ బుకింగ్‌పై 20 శాతం వరకు తగ్గింపు అందించడమే కాకుండా, వినియోగదారుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఇస్తోంది.

మెట్రో స్టేషన్ల

నగర వాసులకు బైక్ టాక్సీలు, మెట్రో రైలు రెండింటినీ కలిపి ప్రయాణించేందుకు ఇది చక్కటి ఎంపికగా మారింది.“METRO” అనే కూపన్ కోడ్‌ను ఉపయోగించి రూ. 35 లేదా అంతకంటే తక్కువ టికెట్ ధర ఉన్నట్లయితే అది ఉచితంగా లభిస్తుంది. టికెట్ ధర రూ. 35 కంటే ఎక్కువ ఉన్నా ఆ మొత్తాన్ని తగ్గిస్తారు. ఇది హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ భాగస్వామ్యం మెట్రో స్టేషన్ల నుండి చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా.. నగర రవాణాను మరింత సులభతరం చేస్తుంది.ప్రయాణికులతో పాటు తమ డ్రైవర్ భాగస్వాములైన ‘కెప్టెన్‌ల’ సంక్షేమానికి కూడా ర్యాపిడో ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తో గురువారం ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం బైక్ టాక్సీ, క్యాబ్ కెప్టెన్లకు వారి వాహన నిర్వహణలో గణనీయమైన ప్రయోజనాలను అందించనుంది.

Rapido:హెచ్‌పీసీఎల్‌తో ర్యాపిడో ఒప్పందం

ఇంధనంపై

ఈ కార్యక్రమం మొదట హైదరాబాద్‌‌లో ప్రారంభమై, భవిష్యత్తులో భారతదేశంలోని 11 నగరాలకు విస్తరించనుంది.ఈ ఒప్పందం వల్ల దేశవ్యాప్తంగా 3.8 లక్షల మందికిపైగా కెప్టెన్‌లకు మేలు జరుగుతుందని ర్యాపిడో తెలిపింది. హైదరాబాద్‌‌లోని అన్ని హెచ్‌‌పీసీఎల్ బంకులలో ఇంధనంపై 1.25 శాతం తగ్గింపు లభిస్తుంది.అంతేకాకుండా హెచ్‌‌పీ లూబ్రికెంట్, వాహన్ కిట్‌‌పై 50 శాతం తగ్గింపు ఇస్తారు. హైదరాబాద్‌‌లోని 300కుపైగా హెచ్‌‌పీసీఎల్ స్టేషన్లలో ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఇది కెప్టెన్‌ల నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.

భవిష్యత్తులో లక్ష్యం

తద్వారా వారి ఆదాయాన్ని పెంచుతుంది. ర్యాపిడో బైక్ టాక్సీ సేవలతో పాటు.. ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను డెలివరీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ర్యాపిడో ఇప్పుడు ఫుడ్ డెలివరీ విభాగంలో కూడా సేవలను అందిస్తోంది. ఇది స్విగ్గీ , జొమాటో వంటి సంస్థలకు పోటీగా నిలుస్తోంది. ఇక దీంతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే వారికి ప్రమాద బీమా , ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించే విధంగా పాలసీని రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.

ర్యాపిడో యజమాని ఎవరు?

ర్యాపిడోకు వ్యవస్థాపకులు మూడు మంది – అరవింద్ సాంకా, రిషికేశ్ ఎస్.ఆర్., పవన్ గుంటుపల్లి. ఇందులో అరవింద్ సాంకా ర్యాపిడో సీఈఓ (CEO)గా కూడా వ్యవహరిస్తున్నారు.ఈ ముగ్గురూ కలిసి 2015లో ర్యాపిడోను స్థాపించారు.

ర్యాపిడో పూర్తి రూపం ఏమిటి?

ర్యాపిడో యొక్క పూర్తి రూపం ప్రత్యేకంగా ఉండదు. ఇది ఒక బ్రాండ్ పేరు మాత్రమే.
అయితే, ర్యాపిడో అనే సంస్థ అసలు పేరే – Roppen Transportation Services Private Limited.

Read Hindi News: hindi.vaartha.com

Read Also: Aadi Srinivas: బీసీ రిజర్వేషన్ పై రఘునందన్ మౌనం ఎందుకు పాటిస్తున్నారు: ఆది శ్రీనివాస్

bike taxi hyderabad Breaking News fastest growing mobility startup indian ride sharing latest news one billion rides rapido bike taxi rapido users Telugu News transportation startup india urban mobility

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.