📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు

Telugu News: Rajanarsimha: ధర్మశాల భవనాన్ని రోగుల సహాయకులకు కేటాయించాలి

Author Icon By Sushmitha
Updated: September 27, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: అధికారుల మధ్య సమన్వయం, నిర్లక్ష్యం కారణంగా గత పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్న నీలోఫర్ ఆసుపత్రిలోని(Nilofer hospital)ధర్మశాల భవనాన్ని వెంటనే రోగుల సహాయకులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ 10 టీచింగ్ ఆసుపత్రులలో వైద్య సేవల బలోపేతంపై మంత్రి వరుస సమీక్షలు నిర్వహించారు.

Flood Effect : మూసారాంబాగ్‌ బ్రిడ్జి మూసివేత

రోగుల సహాయకుల కష్టాలు

నీలోఫర్ ఆసుపత్రిలో ఓపీ, ఐపీ రోగులకు అందిస్తున్న సేవలు, ఎక్విప్‌మెంట్,(Equipment) డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, రోగులకు కనీస సౌకర్యాల కల్పనపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చే నిరుపేద కుటుంబాలకు చెందిన రోగుల సహాయకులు నిలువ నీడ లేక ఆసుపత్రి బయట చెట్ల కింద, రోడ్డు పక్కన పడుతున్న పరిస్థితిపై మంత్రి దామోదర రాజనర్సింహ చలించిపోయారు. మానవత్వంతో వారిని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి స్థలంలో జీహెచ్‌ఎంసీ సహకారంతో పదేళ్ల క్రితం నిర్మించిన ధర్మశాల భవనం నిరుపయోగంగా ఉండటంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి ఆదేశాల మేరకు చర్యలు

మంత్రి ఆదేశాల మేరకు, రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్రూ అధ్యక్షతన నీలోఫర్ ఆసుపత్రి డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎండీ ఫణింద్ర రెడ్డి, డీఎంఈ డాక్టర్ నరేంద్ర, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు. అధికారులు ధర్మశాల భవనాన్ని (జీ+3 భవనంలో 72 గదులు ఉన్నాయి) పరిశీలించారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్రూ ఆదేశాల మేరకు ధర్మశాల భవనాన్ని రోగుల సహాయకులకు కేటాయించడం జరిగింది.

నీలోఫర్ ఆసుపత్రిలో ఏ భవనాన్ని రోగుల సహాయకులకు కేటాయించారు?

పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ధర్మశాల భవనాన్ని కేటాయించారు.

ఈ భవనాన్ని ఎవరు నిర్మించారు?

జీహెచ్‌ఎంసీ సహకారంతో ఈ భవనాన్ని నిర్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Damodar Rajanarasimha Dharamshala government negligence. Health Services hyderabad Latest News in Telugu Niloufer Hospital Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.