📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Today News : Rain – భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు రాకుండా చర్యలు – మంత్రి దామోదర్

Author Icon By Shravan
Updated: August 29, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ Rain : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజారో గ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) అదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభావిత జిల్లాల వైద్యాధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాయంలో టెలిపోన్లో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వర్షాలు అధికంగా కురుస్తున్న మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్లా, సిద్దిపేటలతో పాటు ఇతర జిల్లాలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులను అదేశించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలన్నారు. స్నేక్ బైట్లు, సీజనల్ వ్యాధులు విస్తరించకుండా అవసరమైన మందులు అందుబాటులో ఉంచు కోవాలని మంత్రి అధికారులను అదేశించారు. వచ్చే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. డాక్టర్లు, నర్సింగ్ స్టాప్, ఫార్మా సిస్ట్లు, అసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు

Rain – భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు రాకుండా చర్యలు..

జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారిన నేఫథ్యంలో ప్రజలకు తక్షణ వైద్య సాయం అందించటంపై వైద్య, ఆరోగ్యశాఖ (Health Department) ఉన్నతాధికారులు నిరంతరం జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను అదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వర్ష ప్రభావానికి గురైన ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, అంటు వ్యాధులు ప్రభలకుండా మెరుగైన పారిశుధ్య చర్యలు తీసుకోవటానికి పురపాలక, పంచాయితీరాజ్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి రాజనర్సింహ అధికారులను అదేశించారు. రెవిన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయితీ, డిజాస్టర్ మెనేజ్మేంట్ అధికారులతో సమన్వయం చేసుకొని అధిక వర్షా ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/vedapathashala-vedapathashala-to-be-opened-soon-in-kanipakam/andhra-pradesh/537681/

Breaking News in Telugu Damodar Rajanarasimha news Disaster Management Telangana Flood relief Telangana Heavy rain updates Latest News in Telugu Public health safety Telangana Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.