కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీధికుక్కల(Street dogs) పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటున్నా వాటి దాడి నుంచి తప్పించుకోవడం కష్టంగా పరిణమిస్తున్నది. సుప్రీంకోర్టు వీటి నియంత్రణపై, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలను జారీ చేసింది. అయినా ఈ దాడులు ఆగడం లేదు. ఎందరో పిల్లలు కుక్కల దాడికి గురై మరణించారు. మరికొందరు రేబిస్(Rabies) వ్యాధి సోకి మృత్యువాత పడుతున్నారు. తాజాగా కుక్క కాటుకు గురైన బాలుడు రేబిస్ (Rabies)వ్యాధితో బాధపడుతూ మరణించిన విషాదకర సంఘటన ఇది.
Read Also : Fire Accident: బతుకుదామని వస్తే.. ప్రాణాలే పోయాయి..
చికిత్స పొందుతూ బాలుడు మృతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామం నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ లోని మాదాపూర్ లో స్థిరపడ్డారు మైదం శ్రీనివాస్ కుటుంబం. ఈ దంపతులకు శ్రీ చరణ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే చరణ్ కు రెండు నెలల క్రితం కుక్కకాటుకు గురయ్యాడు. అయితే రెండు రోజుల క్రితం బాలుడు అస్వస్థతకు గురికాగా తార్నాకలోని ఓ ప్రైవేటు ఆసపత్రిలో(hospital) చర్చారు. చరణ్ అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీధి కుక్కలను అదుపు చేయాలని లేకపోతే తమలాంటి కడుపుకోత ఇంకొకరి ఉండకూడదని కోరుతున్నారు.
ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
ఈ ఘోర ఘటన హైదరాబాద్ మాదాపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. బాలుడు వావిలాల గ్రామం, పాలకుర్తి మండలం నుంచి వత్తమైంది.
బాలుడికి ఏమైంది?
శ్రీ చరణ్ అనే బాలుడు కుక్కకాటుకు గురై, రేబిస్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందారు.
Read hindi news: hindi.vaartha.com
Read epaper: https://epaper.vaartha.com/
Read Also: