📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Praveen Kumar Singh: స్థిరమైన దిగుబడి పెంపుకు సురక్షిత విత్తనం అవసరం

Author Icon By Rajitha
Updated: January 29, 2026 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రయోగశాల స్థాయి ఆవిష్కరణలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి

స్మార్ట్ సీడ్ సిస్టమ్స్, నూనెగింజల ఆవిష్కరణలు అంశంపై జాతీయ సంప్రదింపులు పరిశ్రమ సమావేశం

అత్తాపూర్ : రైతులకు అధిక దిగుబడి వచ్చే విధంగా వారికి సహాయ సహకారాలు అందించి బలోపేతానికి కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు. సమగ్ర విత్తన ఆవిష్కరణల ద్వారా నూనెగింజల ఉత్పాదకతను బలోపేతం చేయాలనే ప్రయత్నంలో భాగంగా రాజేంద్రనగర్ (Rajendra nagar) లోని ఐసీఏఆర్- భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థలో దిగుబడి పెంపు కోసం స్మార్ట్ సీడ్ సిస్టమ్స్ మరియు నూనెగింజల ఆవిష్కరణలు” అంశంపై జాతీయ సంప్రదింపులు పరిశ్రమ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ జాతీయ స్థాయి సమావేశంలో విధాన నిర్ణయకులు, శాస్త్రవేతలు, విత్తన సంస్థలు, పరిశ్రమ నాయకులు, రైతు సంఘాలు పాల్గొని ప్రారంభ దశలో వచ్చే దిగుబడి నష్టాలను తగ్గించడం. రైతుల లాభదాయకతను పెంచే తదితర విత్తన వ్యవస్థలపై విస్త్రృతంగా చర్చించారు.

Read also: MGNREGA: చట్టాన్ని మార్చడమంటే పేదల పొట్టకొట్టడమే: మీనాక్షి

Safe seeds are essential for sustainable yield increase.

స్థిరమైన దిగుబడి కోసం సురక్షిత విత్తనాల ప్రాధాన్యం

ముఖ్యఅతిథిగా హాజరైన భారత ప్రభుత్వ వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ వ్యవసాయ కమిషనర్ ప్రవీణ్ కుమార్ సింగ్ మాట్లాడారు… మారుతున్న వాతావరణ పరిస్థితిల నేపథ్యంలో స్థిరమైన దిగుబడి పెంపు కోసం మెరుగైన రకాలు, సురక్షిత విత్తన అభివృద్ధి సాంకేతికతలు. విలువ జోడింపు వేదికల సమన్వయం ఎoతో అవసరమని పేర్కొన్నారు. ఈ జాతీయ సంప్రదింపుల సమావేశంలో ప్రముఖ వ్యక్తులు ఐసిఎఆర్ – ఐఐటఆర్ చైర్మన్ డా.ఎస్.కె రావు, ముంబై ఐఓపిఈపిసి సీఈఓ రమేష్ కొలత్, టిఎస్ఎస్ఓసిఎ ఎండి కిరణ్ కుమార్, ఆర్ వై ఎస్ ఎస్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్ట్ డా.కె.ఎస్ వరప్రసాద్. ఎస్ఎంఎ ప్రెసిడెంట్ డా.జి.ఎన్.వి రామకృష్ణ, ఎంసి ఆర్ సి ఎంఎస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. సత్యవతి, పిజెటిఎయూ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డా. బాలరాం, తదితరులు పాల్గొని తమ సూచనలను అందించారు.

స్మార్ట్ సీడ్ సిస్టమ్స్‌తో నూనెగింజల ఉత్పాదకత పెంపు

అదేవిధంగా అనేక విత్తన, బయోపెస్టిసైడ్ పరిశ్రమల ప్రతినిధులు హాజరైయ్యారు. అనంతరం ఐసిఎఆర్-ఐఐఓఆర్ డైరెక్టర్ డా.ఆర్.కె మాథూర్ మాట్లాడుతూ… ప్రయోగశాల స్థాయి ఆవిష్కరణ క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, విత్తన సంస్థలు మరియు ప్రైవేట్ పరిశ్రమల మధ్య సమన్వయం అత్యంత కీలకమని తెలిపారు.డా.ఎ.ఎల్ రత్న కుమార్, డా. ఆర్.డి ప్రసాద్ సాంకేతిక ప్రజెంటేషన్లలో, తాజాగా విడులైన మరియు పైప్లైన్లో ఉన్న నూనెగింజల రకాలు, హైబ్రిడ్లు, సూక్ష్మీజీవ బయోపెస్టిసైడ్లు, బయోపాలిమర్ ఆధారిత డెలివరి సిస్టమ్స్, అలాగే కోత అనంతర నిల్వ సాంకేతిక ఆవిష్కరణలు ప్రదర్శించబడ్డాయి.

ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి సాంకేతిక ఆవిష్కరణలు

జాతీయ, రాష్ట్ర విత్తన సంస్థలు, ధృవీకరణ ఏజెన్సీలు, పరిశ్రమ ప్రతినిధులు, రైతు (former) ఉత్పత్తిదారుల సంస్థలు, శాస్త్రవేతలతో నిర్వహించిన పరస్పర చర్చా కార్యక్రమంలో స్మార్ట్ సీడ్ సాంకేతికతల స్వీకరణను వేగవంతం చేయడం, నూనెగింజల ప్రాసెసర్లు, నియంత్రణ సంస్థలు సీనియర్ ప్రతినిధులు విధాన మద్దతు, మార్కెట్ అనుసంధానాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమం బ్రేక్ట్ సెషన్లతో పాటు నర్కుడ ఫామ్లోని టెక్నాలజీ కాఫెటీరియాకు. క్షేత్ర సందర్శనతో ముగిసింది. ఈ సందర్శన ద్వారా పాల్గొన్నవారికి ఐసిఎఆర్-ఐఐటఆర్లో అభివృద్ధి చేసిన తాజా సాంకేతిక ఆవిష్కరణలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించింది. ఈ సంప్రదింపులు దేశవ్యాప్తంగా నూనెగింజల విత్తన వ్యవస్థలు, అనుబంధ సాంకేతికతలను బలోపేతం చేసే జాతీయ రోడ్ మ్యాప్ రూపకల్పనకు దోహదపడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ICAR latest news oilseeds research seed innovation smart seeds sustainable farming Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.