📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: OG Movie – ఎల్బీ స్టేడియంలో ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

Author Icon By Anusha
Updated: September 21, 2025 • 10:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో, దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఓజీ’ (OG Movie) పై దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులలో విపరీతమైన హైప్‌ నెలకొంది. పవన్‌ కెరీర్‌లోనే అత్యంత భిన్నమైన గ్యాంగ్‌స్టర్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ గురించి షూటింగ్‌ ప్రారంభం నుంచే భారీ చర్చ సాగుతోంది. ఫ్యాన్స్‌ మాత్రం ప్రతి అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తూ, సినిమా విడుదల దిశగా సాగుతున్న ప్రతీ అంశం మీదా ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

‘ఓజీ’ ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ (LB Nagar) వేదికగా ఎంతో ఘనంగా జరిగింది. వర్షం పడుతున్నప్పటికీ అభిమానులు వేలాదిగా తరలి వచ్చి తమ అభిమాన హీరోను చూడటానికి పోటెత్తారు. స్టేడియం మొత్తానికి పవన్‌ ఫ్యాన్స్‌ కేరింతలతో హోరెత్తించారు.వన్ సైతం వానలోనే తనదైన స్టయిల్లో మాట్లాడుతూ జోష్ నింపారు. తాను డిప్యూటీ సీఎం హోదాలో కాకుండా మీ హీరోగా వచ్చానంటూ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు పవన్.

OG Movie

ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి

‘ఓజీ కన్సార్ట్’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకస్టేజిమీదకు కత్తి పట్టుకొని వచ్చిన పవన్ ఈ సినిమాకు హీరో నేను కాదు సుజీత్ (Sujith) అని దర్శకుడిని ఆకాశానికెత్తేశారు పవర్ స్టార్. డ్రమ్స్ శివమణి మ్యూజిక్ వాయిస్తుంటే మైక్‌తో అందరికీ వినిపించారు పవన్.

ఈ కార్యక్రమంలో హీరోయిన ప్రియాంక మోహనన్, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మిలు పాల్గొన్నారు. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే టికెట్ ధరల పెంపునకు.. ప్రత్యే ప్రీమియం షోకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/chiranjeevi-chiranjeevi-congratulates-mohanlal/cinema/551581/

Breaking News Deputy CM fans excitement latest news LB Nagar og pre release event Pawan Kalyan Pawan Kalyan speech Power Star rain event Telugu News tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.