దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) వర్థంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read also: Chandrababu Davos Tour : రేపు దావోస్ కు సీఎం చంద్రబాబు బృందం
సినీ–రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చిరస్థాయి ముద్ర
నివాళులర్పించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్(NTR) సినీ రంగంలో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని చెప్పారు. ఆయన పాలనలో అమలైన అనేక సంక్షేమ పథకాలు అప్పట్లోనే కాకుండా నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగుతున్న టీడీపీ
ఎన్టీఆర్ ఆలోచనలు, సిద్ధాంతాలే తెలుగుదేశం పార్టీకి బలమని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నేటికీ అదే దారిలో ముందుకు సాగుతోందని అన్నారు. ఎన్టీఆర్ ప్రారంభించిన పథకాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారినట్లు వెల్లడించారు.
తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్ – నందమూరి రామకృష్ణ
ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ను కేవలం ఒక నాయకుడిగా కాకుండా తెలుగువారి సంస్కృతి, కళలకు ప్రతినిధిగా అభివర్ణించారు. కళామతల్లి ముద్దుబిడ్డగా ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని, ఎన్టీఆర్ పేరు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని కొనియాడారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: