📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telugu News: Nampally: ప్రతిభకే ప్రథమ తాంబూలం వర్సిటీ విసి నిత్యానందరావు.

Author Icon By Sushmitha
Updated: September 25, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం(University) ప్రతిష్టాత్మకంగా అందించే పురస్కారాల ఎంపికలో ప్రతిభకే ప్రథమ తాంబూలం ఇస్తున్నామని విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెలుదండ నిత్యానందరావు తెలిపారు. తెలుగు సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష కృషి చేసిన వారి అనుభవం, ప్రతిభ ఆధారంగానే ఈ పురస్కారాలను అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది 30 ఏళ్ల బోధనా అనుభవమున్న అధ్యాపకులను పురస్కార ఎంపిక కమిటీ గుర్తించి సత్కరించడంలో ఔచిత్యం ఉందని ఎంపికను సమర్థించుకున్నారు.

24 మంది ప్రముఖులకు కీర్తి పురస్కారాలు

బుధవారం విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో, 2024 సంవత్సరానికి గాను 24 మంది ప్రముఖులకు కీర్తి పురస్కారాలను అందజేశారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెలుదండ నిత్యానందరావుతో(Nithyananda Rao) పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ సంచాలకుడు ఆచార్య ఎస్. భూపతిరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, ఇతర అధికారులు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కార గ్రహీతలకు శాలువాలు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక మరియు రూ. 5,116 నగదుతో సత్కరించారు. వ్యక్తిత్వ వికాస రంగంలో కీర్తి పురస్కారం అందుకున్న 92 ఏళ్ల ప్రముఖ ఇంజినీర్ తిరువక్కల్ శోభనాద్రి రూ. 50 వేల విరాళాన్ని అందజేశారు.

పురస్కారాలు అందుకున్న వారిలో ఆచార్య కె. సత్యలక్ష్మి, పద్మ మధునాపంతుల, బి.వి. దుర్గాభవాని, గిద్దె రామనర్సయ్య, ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి, గోవిందరాజు చక్రధర్, కె. వీణారెడ్డి, ఆచార్య కె. లావణ్య, డా. బిహెచ్.బి.వి.ర పద్మప్రియ, మేకా రామకృష్ణ, డా. వెంకట్ గోవాడ, పి. ఉమా మహేశ్వర పాత్రుడు, డా. కె. రత్నశ్రీ, టి. శోభనాద్రి, బి. సాంబశివరావు, డా. ఎస్. యాదగిరి, ఎన్. సుభాషిణి, కమలాకర భారతీదేవి, జి. రమ్యశ్రీ, నెల్లుట్ల వెంకటరమణరావు, పి. కల్పవల్లి, ఉరిమళ్ళ సునంద, కె. శ్రీనివాసాచారి, కుంట సదయ్య ఉన్నారు.

కీర్తి పురస్కారాలను ఏ విశ్వవిద్యాలయం అందిస్తుంది?

తెలుగు విశ్వవిద్యాలయం.

2024 సంవత్సరానికి ఎంతమందికి పురస్కారాలు అందజేశారు?

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 24 మందికి కీర్తి పురస్కారాలు అందజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

cultural awards Google News in Telugu Keerthi Puraskarams Latest News in Telugu literature Nampally. Telugu News Today Telugu University

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.