📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: MPR. Krishnaiah – దసరా తర్వాత వినూత్న పద్ధతిలో ఉద్యమం: ఎంపి ఆర్.కృష్ణయ్య

Author Icon By Rajitha
Updated: September 18, 2025 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (సైఫాబాద్) : కళాశాలల బంద్ విరమణ సందర్బంగా ప్రభుత్వం చర్చలు జరిపి కేవలం 600 కోట్లు బడ్జెట్ విడుదల చేస్తామనడం సరికాదని, 8 వేల కోట్లు బకాయిలు ఉంటే, 600 కోట్లు ఏ మూలకు సరిపోతాయని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య (MPR. Krishnaiah) ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక్కొక్క కాంట్రాక్టర్కు 6, 7 కోట్లు ఏక కాలంలో చెల్లిస్తూ, చదువుకునే 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలు 8 వేల కోట్లు ఇవ్వడానికి అవరోధం ఏమిటని ఆయన నిలదీశారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగ జెఎసి ఛైర్మన్ నీల వెంకటేశ్, (Neela Venkatesh) బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ అధ్యక్షత జరిగిన మీడియా సమావేశంలో ఆర్.కృష్ణయ్య (MPR. Krishnaiah) ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఆనేక ఇతర పథకాలకు ఉదారంగా బడ్జెట్ కేటాయిస్తూ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పథకాలకు బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు.

MPR. Krishnaiah

ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు

ఫీజుల బడ్జెట్ చెల్లించకపోతే రాష్ట్రంలో యుద్ధమే కొనసాగుతుందని, దసరా తరువాత విన్నూత పద్ధతిలో ఆందోళనలు కొన సాగిస్తామని, బడ్జెట్ విడుదల చేసేంతవరకు ఉద్యమాలు ప్రతిరోజు కొనసాగుతాయని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. 22 నెలల క్రితం అధికారంలోకి వచ్చన కాంగ్రెస్ (congress) ప్రభుత్వం విద్యార్థులకు 20 రూపాయలు కూడా విడుదల చేయలేదని, ఈ పథకం అమలుకు నాలుగు శాఖల ద్వారా బడ్జెట్లో 5 వేల కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి కూడా విడుదల చేయ లేదని, కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ, ఎస్టీలకు వీటిని ఎం పథకం కింద వేల కోట్లు కేటాయిస్తున్నదని, చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ఈ సమావేశంలో బిసి నాయకులు మణికంఠ, (Manikanta) రాందేవ్ మోదీ, రవియాదవ్, నిఖిల్ పటేల్, లీలా తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుగా ఎంత మొత్తం చెల్లించాల్సి ఉందని ఆర్.కృష్ణయ్య చెప్పారు?
సుమారు రూ.8 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు.

ప్రభుత్వం చర్చల తర్వాత ఎంత మొత్తం విడుదల చేస్తామని తెలిపిందని ఆర్.కృష్ణయ్య విమర్శించారు?
కేవలం రూ.600 కోట్లు విడుదల చేస్తామని తెలిపిందని విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/strike-87-percent-private-hospitals-distance-themselves-from-strike/hyderabad/549495/

BC welfare Breaking News Congress government fee reimbursement latest news r.krishnaiah scholarships Students Protest Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.