హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతం తెలుగు సినిమా ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రదేశం. ముఖ్యంగా కొత్త సినిమాల విడుదల సమయంలో ఈ ప్రాంతంలో అభిమానుల హడావుడి తారస్థాయికి చేరుతుంది. హీరోల సినిమాలు రిలీజ్ అయితే, థియేటర్ల వద్ద కేకలు, ఫ్యాన్స్ షోలు, పూల వర్షాలు, బాణాసంచా పేలుళ్లు, కటౌట్లకు పాలు పోసే ఉత్సాహం కనిపించడం సహజమే. అయితే, ఈ హడావుడి కొన్ని సందర్భాల్లో ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ (RTC Cross Road) లోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు కొత్త నిర్ణయం తీసుకున్నాయి.గతంలో జరిగిన సంఘటనలు ఈ నిర్ణయానికి కారణమయ్యాయి.గతేడాది డిసెంబర్ 4న జరిగిన ఒక ప్రమాదకర సంఘటన వల్ల థియేటర్ల యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి.ఈ హెచ్చరికలకు సంబంధించి థియేటర్ల ఆవరణలో వాల్‌పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కొత్త సినిమాలు
బాణాసంచా కాలిస్తే పోలీసు కేసులు పెడతామని వాటిపై రాసి ప్రదర్శించారు. గతంలో అనగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా (Devara movie) రిలీజ్ సందర్భంగా అభిమానులు ఇలానే బాణాసంచా కాల్చారు. ఈక్రమంలో నిప్పురవ్వలు విస్తరించి, ఆ పక్కనే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కటౌట్‌కు నిప్పంటుకుని కాలిపోయింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడటం కోసమే థియేటర్ల యాజమాన్యాలు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి.దీంతో పాటుగా మరి కొన్ని నియమాలు కూడా అమలు చేస్తున్నారు. వీటిలో భాగంగా కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్లు ఉన్న వాళ్లను మాత్రమే థియేటర్లలోకి అనుమతిస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర 80 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి హడావుడి లేకుండా, ప్రమాదాలు వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
ఈ థియేటర్ ఎప్పుడు స్థాపించబడింది?
ఈ థియేటర్ 1980లో స్థాపించబడింది.
సంధ్యా 70MM A/C థియేటర్‌ను ఎవరు స్థాపించారు?
ఈ థియేటర్‌ను ఎం. చంద్రయ్య స్థాపించి, ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: