📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

Telugu : తల్లిపాలవంటి మాతృభాష జాతి సంస్కృతికి ప్రతీక – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Author Icon By Shravan
Updated: August 14, 2025 • 2:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరబాద్ (నాంపల్లి) : మాతృభాష తల్లిపాలంతటి ప్రాముఖ్యత గలదని, మాతృభాష పరస్పరం సంభాషణల కోసమేకాదు జాతి సాంస్కృతికి ప్రతీక అని తెలంగాణ రాష్ట్ర గవర్నరు (Governor of Telangana State) సురవరం ప్రతాపరెడ్డి తెలుగు (Telugu) విశ్వవిద్యాలయం అధ్యక్షుడు జిష్ణుదేవ్ వర్మ అన్నారు. అందుకే జాతీయ నూతన విద్యావిధానంలో ప్రాథమికస్థాయి వరకు విద్యార్థులకు మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం ఇచ్చిందంటూ ప్రతీఒక్కరూ విధిగా మాతృభాషలో వ్రాయడం, చదవడం అభ్యసించాలని, మాతృభాషలోనే మాట్లాడుకోవాలని, ప్రతీ ఇల్లు మాతృభాష పాఠశాల కావాలని సూచించారు.

మండలి వెంకట కృష్ణారావు సేవల ప్రశంస

ప్రముఖ గాంధేయవాది, పేదబడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన సంఘసేవకుడు, మహోన్నత రాజకీయ నాయకుడు మండలి వెంకట కృష్ణారావు మాతృభాషకు చేసిన సేవలు అనితరసాధ్యమన్నారు. 1977లో ఏపి ఏర్పడిన భయంకర ఉప్పెన సమయంలో ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.

అంతర్జాతీయ తెలుగు కేంద్రం స్థాపన

తెలుగుజాతి ఐక్యతను, తెలుగుభాష-సాంస్కృతిక వికాసం, సంస్కృతి పరిరక్షణ, జాతీయ అంతర్జాతీయంగా చాటడానికి అంతర్జాతీయ తెలుగు కేంద్రాన్ని (International Telugu Center) తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పెట్టడం, ప్రతీ సంవత్సరం ఆయన ఆశయానికి కృషిచేస్తున్న వారికి సంస్కృతి పురస్కారాలతో సత్కరించడం ముదావహం అన్నారు.

మండలి బుద్ధప్రసాద్‌కు అభినందనలు

తండ్రి ఆశయాలకు కొనసాగిస్తూ అన్నివిధాలా పాటుపడుతున్న మండలి బుద్ధప్రసాద్ ను ఎంతగానో అభినందించారు.

సంస్కృతి పురస్కారాల ప్రదానోత్సవం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిష్టాత్మక మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా සñoයි. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెలుదండ నిత్యానందరావు సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నరు, విశ్వవిద్యాలయం అధ్యక్షుడు జిష్ణుదేవవర్మ ముఖ్యఅతిథిగా పాల్గొని గౌరవ అతిథులు తెలంగాణ ప్రభుత్వ పూర్వసలహాదారు, విశ్రాంత ఐఎఎస్ అధికారి డా. కె.వి.రమణాచారి, ఏపి అవనిగడ్డ శాసనభ్యుడు, ఏపి శాసనసభ పూర్వ ఉపసభాపతి డా. మండలి బుద్ధప్రసాద్, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమం తరావు తదితరులతో కలిసి అజో-విభో-కందాళం ఫౌండేషన్, అమెరికా అధ్యక్షుడు అప్పాజోస్యుల సత్యనారాయణను ఘనంగా సత్కరించి 2024 సంవత్సరానికి గాను తెలుగు భాషాభివృద్ధి మండలి, సోలాపూర్ అధ్యక్షుడు కమటం మల్లికార్జున్ను ఘనంగా సత్కరించి 2025 సంవత్సరానికిగాను సంస్కృతి పురస్కారాలను ప్రదానంచేసి శుభాభినందనలు తెలిపి తెలుగు భాష, సంస్కృతికి వారు చేస్తున్న కృషిని ప్రశం సించారు.

స్వాగతం మరియు అధ్యక్షోపన్యాసం

ముందుగా సభకు విశ్వవిద్యాలయ విస్తరణ విభాగంరింగు రామమూర్తి స్వాగతం పలికారు. ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షోపన్యాసంలో గాంధేయ విలువలు, నైతిక నిష్ఠాగరిష్టతకు, ధర్మకర్తత్వ సిద్ధాంతానికి, నిస్వార్ధ సేవా పరాయణతకు నిలువెత్తు నిదర్శ నంగా నిలిచిన రాజకీయ నాయకుడు మండలి వెంకట కృష్ణారావు అని కొనియాడారు. పురస్కార స్వీకర్తలను అభినందించారు

డా. కె.వి.రమణాచారి ప్రసంగం

డా. కె.వి.రమణాచారి దేవుడిచ్చే ఆరు సుగుణాలు కలిగివున్న మండలి వెంకటకృష్ణారావు స్మరించుకొంటుండగా కుమారుడు బుద్దప్రసాద్ వాటిని పుణికిపుచ్చుకుని ఈ కార్యక్రమం నిర్వహి స్తున్నందుకు అభినందనలు తెలిపారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/injustice-to-telangana-due-to-political-vendetta/telangana/530174/

Breaking News in Telugu cultural identity cultural pride language preservation Latest News in Telugu mother tongue native language importance Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.