📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: Montha Cyclone: ఐదు అడుగులు ఎత్తిన నాగార్జునసాగర్ 12 క్రెస్ట్ గేట్లు

Author Icon By Sushmitha
Updated: November 1, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: మొంథా తుఫాను(Montha Cyclone) కారణంగా గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులలో గత రెండు రోజులుగా మళ్లీ జలకళ సంతరించుకుంది. కృష్ణా నదిపై ఉన్న నాగార్జున సాగర్(Nagarjuna Sagar) జలాశయానికి ఎగువ నుంచి 1,46,744 క్యూసెక్కుల నీరు రావడంతో, శుక్రవారం 12 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 96,696 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.60 అడుగులకు చేరుకుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉంది.

Read Also: AP Crime: విద్యార్ధి ఆత్మహత్యకు మహిళా లెక్చరర్ వేధింపులే కారణమా?

శ్రీశైలం ప్రాజెక్టు రికార్డు వరద

శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలో (1984 నుంచి పరిశీలిస్తే) ఈ ఏడాది అత్యధిక వరద వచ్చింది. ఈ ఏడాది జులై 8న మొదట గేట్లు తెరుచుకోగా, మొత్తం తొమ్మిదిసార్లు గేట్లు తెరిచారు. దాదాపు 60 రోజులకు పైగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి కృష్ణా ప్రవాహం, తుంగభద్ర నది నుంచి కలిపి శ్రీశైలానికి ఇప్పటివరకు 2,262 టీఎంసీల వరద రాగా, దిగువకు 2,086 టీఎంసీలను వదిలారు. ప్రస్తుతం శ్రీశైలానికి 74 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జూరాలకు 28 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు 4 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 2.49 లక్షలు వదులుతున్నారు.

గోదావరి నది వరద

గోదావరి పరీవాహకంలోనూ రికార్డు స్థాయిలో వరద నమోదైంది. ఎస్సారెస్పీకి (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) గురువారం నాటికి 890 టీఎంసీల మేర వరద చేరింది. 1983లో (1,168 టీఎంసీలు), 1988లో (913 టీఎంసీలు) తర్వాత ప్రాజెక్టు చరిత్రలోనే రెండో అత్యధిక వరద రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీకి 59 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 11న తొలిసారి గేట్లు తెరవగా, అప్పటి నుంచి నిరంతరం దిగువకు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 733 టీఎంసీలను దిగువన నదిలోకి విడుదల చేశారు. మొత్తం ఎగువ నుంచి 1,368 టీఎంసీలు వరద వచ్చింది. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 1.33 లక్షలు, భద్రాచలం వద్ద 2.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.

నాగార్జున సాగర్ జలాశయం ఎన్ని గేట్లు ఎత్తింది?

ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో 12 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తారు.

ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం ఎంత వరద వచ్చింది?

జూరాల, తుంగభద్ర నదుల నుంచి కలిపి ఇప్పటివరకు 2,262 టీఎంసీల వరద వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

flood alert Godavari River Google News in Telugu heavy rains. Krishna River Latest News in Telugu nagarjuna sagar Srisailam Dam Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.