హైదరాబాద్: మొంథా తుఫాను(Montha Cyclone) కారణంగా గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులలో గత రెండు రోజులుగా మళ్లీ జలకళ సంతరించుకుంది. కృష్ణా నదిపై ఉన్న నాగార్జున సాగర్(Nagarjuna Sagar) జలాశయానికి ఎగువ నుంచి 1,46,744 క్యూసెక్కుల నీరు రావడంతో, శుక్రవారం 12 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 96,696 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.60 అడుగులకు చేరుకుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉంది.
Read Also: AP Crime: విద్యార్ధి ఆత్మహత్యకు మహిళా లెక్చరర్ వేధింపులే కారణమా?

శ్రీశైలం ప్రాజెక్టు రికార్డు వరద
శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలో (1984 నుంచి పరిశీలిస్తే) ఈ ఏడాది అత్యధిక వరద వచ్చింది. ఈ ఏడాది జులై 8న మొదట గేట్లు తెరుచుకోగా, మొత్తం తొమ్మిదిసార్లు గేట్లు తెరిచారు. దాదాపు 60 రోజులకు పైగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి కృష్ణా ప్రవాహం, తుంగభద్ర నది నుంచి కలిపి శ్రీశైలానికి ఇప్పటివరకు 2,262 టీఎంసీల వరద రాగా, దిగువకు 2,086 టీఎంసీలను వదిలారు. ప్రస్తుతం శ్రీశైలానికి 74 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జూరాలకు 28 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు 4 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 2.49 లక్షలు వదులుతున్నారు.
గోదావరి నది వరద
గోదావరి పరీవాహకంలోనూ రికార్డు స్థాయిలో వరద నమోదైంది. ఎస్సారెస్పీకి (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) గురువారం నాటికి 890 టీఎంసీల మేర వరద చేరింది. 1983లో (1,168 టీఎంసీలు), 1988లో (913 టీఎంసీలు) తర్వాత ప్రాజెక్టు చరిత్రలోనే రెండో అత్యధిక వరద రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీకి 59 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 11న తొలిసారి గేట్లు తెరవగా, అప్పటి నుంచి నిరంతరం దిగువకు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 733 టీఎంసీలను దిగువన నదిలోకి విడుదల చేశారు. మొత్తం ఎగువ నుంచి 1,368 టీఎంసీలు వరద వచ్చింది. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 1.33 లక్షలు, భద్రాచలం వద్ద 2.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.
నాగార్జున సాగర్ జలాశయం ఎన్ని గేట్లు ఎత్తింది?
ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో 12 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తారు.
ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం ఎంత వరద వచ్చింది?
జూరాల, తుంగభద్ర నదుల నుంచి కలిపి ఇప్పటివరకు 2,262 టీఎంసీల వరద వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: