జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయి ఘనవిజయాన్ని నమోదు చేసింది. ప్రారంభ రౌండ్ నుంచే ఆధిక్యంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav), ప్రతి రౌండ్‌లో కూడా తన మెజార్టీని పెంచుకుంటూ, చివరకు సుమారు 24,729 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి మాగంటి సునీత (కారు పార్టీ) 74,259 ఓట్లు సాధించారు. విజయానంతరం మాట్లాడుతూ ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నవీన్ యాదవ్ తెలిపారు.
Read Also: Naveen yadav: హోరా హోరు పోరులో కాంగ్రెస్ దే ఘన విజయం
కౌంటింగ్‌కు ముందే ఎన్‌సిపి అభ్యర్థి మహ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి
ఈ ఎన్నికలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఎన్‌సిపి తరఫున పోటీ చేసిన మహ్మద్ అన్వర్ (Mohammad Anwar)కౌంటింగ్ ప్రారంభానికి కొద్దిసేపటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్ ఫలితాల కోసం వేచి ఉన్న సమయంలో ఆయనకు ఛాతీ నొప్పి మొదలై వెంటనే ఆసుపత్రికి తరలించినా, అక్కడికి చేరేలోపే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. 40 ఏళ్ల అన్వర్(Mohammad Anwar) వ్యాపారవేత్తగా పనిచేసేవారు. ఈ ఉపఎన్నికలో ఆయనకు 24 ఓట్లు వచ్చినట్లు సమాచారం. అన్వర్ తన కుటుంబంతో కలిసి ఎర్రగడ్డలోని లాల్ నగర్ ప్రాంతంలో నివసించేవారని తెలిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: