హైదరాబాద్: ప్రస్తుత యాసంగి సీజనులో యూరియా కొరత లేకుండా చూడాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు. ప్రతి నెలా 2 లక్షల టన్నులకు తగ్గకుండా సరఫరా చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని రామగుండం నుండి 100 శాతం కేటాయింపు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
Read Also: Commonwealth Games : భారత్‌లోనే 2030 కామన్వెల్త్ గేమ్స్

యూరియా సరఫరా, రబీ సీజన్ ప్రణాళికలు
హైదరాబాద్‌లో బుధవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఇప్పటి వరకు 4 లక్షల టన్నులకు గాను 3.05 లక్షల టన్నుల యూరియా (Urea) సరఫరా అయిందని, మిగిలిన మొత్తం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రబీ సీజన్ ముగిసేంత వరకు వరంగల్ (Warangal) రేక్ పాయింట్‌ను కొనసాగించాలని రైల్వేకు లేఖ రాసినట్టు తెలిపారు. జనవరి వరకు కనీసం 3.50 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండాలని స్పష్టం చేశారు.
పత్తి కొనుగోళ్లు, జొన్నల విక్రయం, సాంకేతికత వినియోగం
అలాగే గత రబీలో మార్క్‌ఫెడ్ (Markfed) ద్వారా కొనుగోలు చేసిన జొన్నలను మంచి ధర రైతులకు అందుబాటులో ఉంచాలని, వచ్చిన వెంటనే విక్రయించాలన్నారు. తద్వారా ఖాళీ అయిన గోదాములను రైతులకు ఇతర ఉత్పత్తుల నిల్వల కోసం ఉపయోగించాలని అన్నారు.
అన్ని జిన్నింగ్ మిల్లులు అందుబాటులో ఉండటంతో పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని తెలిపారు. స్లాట్ బుకింగ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు 2.63 లక్షల టన్నుల పత్తిని సేకరించినట్టు వెల్లడించారు. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే సాంకేతికతను త్వరగా అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. రబీ సీజన్ రైతు భరోసా అందించే సమయానికి ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగంలోకి తేవాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితర అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: