📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Minister Rajanarsimha: ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు

Author Icon By Sushmitha
Updated: November 20, 2025 • 10:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ (GGH) జెరియాట్రిక్ సేవలు (Geriatric services) (వృద్ధాప్య చికిత్స) అందించాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఈ సమీక్షలో మంత్రి పాల్గొన్నారు.

Read Also: Mahesh Babu: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్

Minister Rajanarsimha Special medical services for the elderly in government hospitals

ఆరోగ్య వ్యవస్థలో మార్పులు, జెరియాట్రిక్ కేర్

జీవన ప్రమాణాలు పెరగడం వల్ల వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి దామోదర్ (Minister Rajanarsimha)పేర్కొన్నారు. పిల్లల కోసం ‘చైల్డ్ హెల్త్ కేర్ (Child Health Care) సెంటర్లు’ నిర్వహిస్తున్నట్లుగానే, జపాన్, ఇటలీ తరహాలో భవిష్యత్తులో వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటళ్లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

జీవనశైలి వ్యాధులు, ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు

ఒకప్పుడు కమ్యూనికెబుల్ డిసీజెస్ (అంటు వ్యాధులు) ఎక్కువగా ఉండగా, ఇప్పుడు నాన్-కమ్యూనికెబుల్ డిసీజెస్ (జీవనశైలి వ్యాధులు) ఎక్కువయ్యాయని మంత్రి అన్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె, కిడ్నీ జబ్బుల వంటి లైఫ్‌స్టైల్ డిసీజ్‌లకు మెరుగైన ట్రీట్‌మెంట్ అందించే విధంగా హాస్పిటళ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో ఎన్సీడీ క్లినిక్‌లు, డేకేర్ క్యాన్సర్ సెంటర్లు, ఐవీఎఫ్ సెంటర్లు ప్రారంభించుకున్నామని, ఇప్పుడు జెరియాట్రిక్ సేవలను విస్తరిస్తున్నామని చెప్పారు.

ట్రీట్‌మెంట్ (Treatment) పేరుతో ప్రజలను దోచుకునే ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించినా, మంచిగా పని చేయని వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్లూ, డీఎంఈ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Damodara Rajanarasimha Geriatric services Google News in Telugu Latest News in Telugu NCD Clinics private hospital regulation public health Telangana Health Department; Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.