📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Minister Konda Surekha – తెలంగాణను ఎకో టూరిజం హబ్ చేయాలి

Author Icon By Rajitha
Updated: September 20, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ (Hyderabad) : తెలంగాణను ఎకో టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎకో టూరిజం కోసం గుర్తించిన సైట్లలో సమగ్రంగా అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర ఆటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో ఒక ప్రత్యేక ఎకోటూరిజం హబ్ అభివృద్ధిచేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. తెలంగాణ టూరిజం పాలసీలో అంశాలను మనం ఎంత ఎకో టూరిజాన్ని మన రాష్ట్రంలో డెవలప్ చేయొచ్చన్న విషయాలను మంత్రి ప్రత్యేకంగా ఱడిగి తెలుసుకున్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఎకోటూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది.

హబ్ గా డెవలప్ చేయాల్సిన

ఈ స్క్రీనింగ్ కమిటీ భేటీలో అనంతగిరి(వికారాబాద్), కనకగిరి (ఖమ్మం), నందిపేట్,నిజామాబాద్), మన్ననూర్ జంగల్ రిసార్టు (నాగర్ కర్నూల్) , ముచ్చెర్ల ఎకో పార్కు (నల్గొండ), వైజాగ్ కాలనీ (నల్గొండ), మంజీరా (సంగారెడ్డి), అమరగిరి (నాగర్ కర్నూల్) తదితర ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు అమలుపై సుదర్జీ చర్చ జరిగింది. ఎక్కడికక్కడ ఆయా ఎకో టూరిజం సెంటర్లలో గిరిజనులు, ఇతర ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేయాలని సూచించారు. ఎకో టూరిజం డెవలప్ చేస్తున్న ప్రాంతాల్లో టెంపుల్స్ ఉంటే వాటిని కూడా మేరకు డెవలప్ చేయాలని సూచించారు. ఆథ్యాత్మిక పద్ధతిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యప్రదేశ్ లోని భీమ్ టెక్కా కొండల తరహాలో నీలాద్రి కొండలపై ప్రాచీన కాలం నాటి గుర్తులు ఉన్నందున పర్యాటక ప్రాంతంగా ఎకో టూరిజం ప్రాంతంగా డెవలప్ చేయాలన్నారు. ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్ గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన నిధులు టూరిజం డిపార్టుమెంటు, ఎండోమెంటు శాఖ నుంచి తీసుకొని అయినా డెవలప్ చేయాలన్నారు. వికారాబాద్ అనంతగిరి హిల్స్ మొదటి దశ పనులు పూర్తయ్యాయని, రెండో దశలో కారవాన్ క్యాంపింగ్, ఎకో కాటేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Minister Konda Surekha

అక్టోబర్ 2025 నుంచి

ఖమ్మంలోని కనకగిరి ప్రాజెక్టు (Kanakagiri Project) పనులు అక్టోబర్ 2025 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. నల్గొండ ముచ్చర్ల ఎకో పార్క్ నైట్ సఫారీ, వీఆర్ పార్క్ డైనోసార్ పార్క్ వంటివి రూపకల్పన చేసినట్టు వివరించారు. సంగారెడ్డిలోని మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో భూసేకరణ, భూమి నందిపేట్ కేటాయింపు సమస్యల పరిష్కారం పెండింగ్లో ఉందన్నారు. నిజామాబాద్ నాగర్కర్నూల్ మన్ననూరు దొమల పెంట, అమరగిరి, పాకాల సరస్సు, కిన్నెరసాని, నాగార్జునసాగర్, వనస్థలి మొదలైన ప్రాంతాల ప్రాజెక్టులపై విసృతమైన చర్చ జరిగింది. ఎకో టూరిజం ప్రాజెక్టులు కేవలం ప్రకృతి వైభవం వరకే పరిమితం కాకుండా అక్కడి ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలని మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) సమావేశంలో ప్రస్తావించారు. ఎక్కడ ఆలయాలు ఉన్నాయో అక్కడ ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, ధార్మిక విశ్వాసాలు ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.. సమావేశంలో తెలంగాణలో వివిధ జిల్లాల్లో జరుగుతున్న ఎకో టూరిజం ప్రాజెక్టుల పురోగతిని మంత్రి కొండా సురేఖ సమీక్షించారు.

తెలంగాణను ఎకో టూరిజం హబ్ గా తీర్చిదిద్దడానికి ఎవరు కృషి చేస్తున్నారు?
రాష్ట్ర ఆటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.

ఎకో టూరిజం ప్రాజెక్టులపై సమావేశం ఎక్కడ జరిగింది?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/minister-seethakka-interest-free-loans-for-women-entrepreneurs/hyderabad/550718/

Ananthagiri hills Breaking News Kanakagiri Khammam latest news Minister Konda Surekha Nandipet Telangana tourism Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.