📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: MG గోపాల్ – సమగ్ర ఇంధన సామర్థ్యం చారిత్రక బాధ్యత

Author Icon By Rajitha
Updated: September 12, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రూ.20 వేల కోట్ల విద్యుత్ బిల్లుల ఆదా విజిలెన్స్ కమిషనర్ ఎంజి గోపాల్

హైదరాబాద్ (Hyderabad) : సమగ్ర ఇంధన సామర్థ్యం చారిత్రక బాధ్యత అని తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ ఎంజి గోపాల్ (MG GopaL) అన్నారు. దేశంలో నానాటికి పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడంలో భాగంగా ఇందనసమర్ధవంతమైన సాంకేతికతలను వినియోగించేందుకు అన్ని ప్రభుత్వాలు సమగ్ర వ్యూహాన్ని అనుసరించాలన్నారు. ఇంధన సామర్థ్య చర్యల అమలుపై గురువారం విద్యుత్ రంగ ప్రముఖులు ఆయనతో భేటీ అయ్యారు. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించి “దానికి, పోటీతత్వాన్నిపెంచడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్దారించడానికి ఈ పథకం యొక్క ఉపయోగాలను ఆయన నొక్కి చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల భాగస్వామ్యంతో పాటు, విద్యుత్ వినియోగదారుల అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే

ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంతోపాటు పర్యావరణ పరిరక్షణకు చేయూతనిచ్చినట్లవుతుందని అన్నారు. దేశంలో 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో అందునా మరీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) రాష్ట్రాలు ఈ జాతీయ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇంధన సామర్థ్య చర్యలను పెద్ద ఎత్తున చేపట్టి నిర్దిష్ట కార్యాచరణతో అమలు చేస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే 20 శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉజాలా, ఇమొబిలిటీ వంటి వివిధ విద్యుత్ పొదుపు కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు.

MG Gopal

మరీ ముఖ్యంగా

ఈ కార్యక్రమాలు పర్యావరణ, ఆర్థిక స్థిరత్వానికి రాష్ట్రం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తాయని వెల్లడించారు. మరీ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన మూసీ నది ప్రక్షాళణలో ఇది మరింతగా దోహదపడుతుందన్నారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ 2015 నుండి గృహాలకు ఈ పథకం కింద ఎస్ఈడీ (SED) బల్బులను అందించడం ద్వారా దాదాపు రూ.20 వేల కోట్లకు పైగా విద్యుత్ బిల్లులను ఆధా జరిగినట్లు వివరించారు. దీర్ఘకాలిక పర్యావరణ స్థిరత్వాన్ని నిర్ధారించే కార్యక్రమాలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థతో సహా అన్ని ఎసీఏలు ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్యక్రమాల అమలును తీవ్రతరం చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రజా భవనాలలో ఇంధన సామర్థ్య చర్యలు అమలులో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఆగ్రస్థానంలో ఉందని తెలిపారు.

Q1: సమగ్ర ఇంధన సామర్థ్యం గురించి విజిలెన్స్ కమిషనర్ ఎంజి గోపాల్ ఏమన్నారు?
A1: సమగ్ర ఇంధన సామర్థ్యం చారిత్రక బాధ్యత అని అన్నారు.

Q2: ఇంధన సామర్థ్యం చర్యలు ఏ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి?
A2: పెరుగుతున్న భూతాపాన్ని (global warming) తగ్గించడంలో సహాయపడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ktr-group1-posts-scam-judicial-commission-demand/telangana/545735/

Andhra Pradesh Breaking News Carbon Emissions Energy Efficiency latest news Net Zero 2070 Telangana Telugu News Vigilance Commissioner MG Gopal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.