హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారు తప్పక తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నిబంధన వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో Metro స్టేషన్‌లో బుధవారం ఒక ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆ వ్యక్తి వద్ద భద్రతా సిబ్బంది రూ. 3.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సిబ్బంది అతడిని ఆపి, నియమాల గురించి తెలియజేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, మెట్రో రైల్లో గరిష్టంగా రూ. 2 లక్షల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లే అనుమతి ఉందని వివరించారు.
Telangana News : అమ్మవారి అలంకరణ లో బతుకమ్మ…

Metro
దాంతో, అదనపు నగదు కారణంగా ఆ ప్రయాణికుడిని రైల్లోకి అనుమతించలేదు. చేసేదేమీ లేక, అతను ఆ మొత్తంతో స్టేషన్‌ను వీడాల్సి వచ్చింది. మెట్రో Metro అధికారులు ఈ నిబంధనను భద్రతా కారణాల దృష్ట్యా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ మెట్రోలో గరిష్టంగా ఎంత వరకు నగదు తీసుకెళ్లవచ్చు?
RBI మార్గదర్శకాల ప్రకారం మెట్రోలో గరిష్టంగా రూ. 2 లక్షల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లవచ్చు.
ఆ ప్రయాణికుడు వద్ద ఎంత నగదు ఉంది?
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌లో ఆ ప్రయాణికుడు వద్ద రూ. 3.5 లక్షలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: