📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి

Telugu News: Medchal-సీనియర్ల ర్యాగింగ్ భరించలేక విద్యార్థి ఆత్మహత్య

Author Icon By Sushmitha
Updated: September 22, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ర్యాగింగ్(Raging) భూతానికి విద్యార్థులు(students) బలి అవుతున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. సీనియర్ విద్యార్థులు కొత్తగా కాలేజీలో చేరిన వారిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ వేధింపులు ఆత్మహత్యలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా మేడ్చల్‌లో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. సీనియర్ల టార్చర్‌ను తట్టుకోలేక ఒక బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సెల్ఫీ వీడియోలో ఆవేదన

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన సాయితేజ, మేడ్చల్‌లోని(Medchal) సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సీనియర్ల వేధింపులను తట్టుకోలేక హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు సాయితేజ ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో, సీనియర్లు తనను బలవంతంగా మద్యం తాగించారని, ఒక బార్‌కు తీసుకెళ్లి రూ.10 వేల బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారని తెలిపాడు.

కుటుంబ సభ్యుల ఆరోపణలు, పోలీసుల దర్యాప్తు

సాయితేజ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ కుమారుడి మరణానికి సీనియర్ల వేధింపులతో పాటు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సాయితేజ స్నేహితులు కూడా సీనియర్ల టార్చర్‌తోనే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఏ కాలేజీలో చదువుతున్నాడు?

మేడ్చల్‌లోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సాయితేజ బీటెక్ చదువుతున్నాడు.

సాయితేజ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి?

సీనియర్లు బలవంతంగా మద్యం తాగించడం, రూ.10 వేల బిల్లు కట్టాలని ఒత్తిడి చేయడమే కారణమని సెల్ఫీ వీడియోలో తెలిపాడు.

యర్ల టార్చర్‌తోనే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ec-ec-preparing-for-bihar-elections/national/551871/

BTech student Google News in Telugu hyderabad Latest News in Telugu police investigation ragging Siddartha Engineering College. Student suicide Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.