హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, అలా చేసి ఉంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు ఇప్పటికే జైల్లో ఉండేవారని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. గవర్నర్ అనుమతితో కేటీఆర్‌పై విచారణకు మార్గం సుగమం అయిన అంశంపై ఆయన గురువారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రజల సొమ్ము ఎవరు తిన్నా శిక్ష అనుభవించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
Read also : Kondapalli Srinivas: పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలి
కేటీఆర్, బీజేపీపై మహేష్ గౌడ్ విమర్శలు
- కేటీఆర్‌పై ప్రశ్న: ఎవరిని అడిగి ప్రజలకు సంబంధించిన కోట్ల రూపాయలను కేటీఆర్ బదిలీ చేశారని మహేష్ గౌడ్ నిలదీశారు.
- బీజేపీపై విమర్శలు: మోదీ, రేవంత్ రెడ్డి (Revanth Reddy) మధ్య చీకటి ఒప్పందం జరిగి ఉంటే ఆరు నెలల ముందే గవర్నర్ అనుమతి వచ్చేదని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఘోరంగా ఓడిపోవడంతోనే దిమ్మ తిరిగి గవర్నర్ అనుమతి ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం నిర్మాణంలో లక్షల కోట్లు అవినీతి జరిగిందని బీజేపీ నాయకులే ఆరోపించారు కదా అని ఆయన గుర్తు చేశారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా చిత్తశుద్ధితో ఉందని మహేష్ గౌడ్ ప్రకటించారు.
- 42% రిజర్వేషన్: తనకు చట్టపరంగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని ఉందని, అయితే కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే పార్టీపరంగా ఇచ్చి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
- కేంద్రాన్ని నిలదీత: కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుకు 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే అవకాశం ఉన్నా, ఎందుకు చేయడం లేదో బండి సంజయ్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
- ఉద్యమం: బీసీల రిజర్వేషన్ కోసం ఉద్యమం ఆగదని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తుందని పునరుద్ఘాటించారు. కాళేశ్వరం సీబీఐకి అప్పగించినా, విచారణ ఆలస్యంపై కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన అడిగారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :