📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

Author Icon By Anusha
Updated: September 3, 2025 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వినాయక పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఇక వినాయకుడిని మండపంలలో పెట్టి 11 రోజులు ప్రత్యేక పూజలు చేస్తారు. కొన్నిచోట్ల మూడో రోజు, ఐదో రోజూ, 9వ రోజూ కూడా వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే ట్యాంక్ బండ్ పై ప్రత్యేక శోభయాత్ర,వేడుకలతో వినాయకుడి నిమజ్జనానికి ఏర్పాటు జరుగుతున్నాయి.

ఈనెల 6వ తేదీన జరగనున్న గణేశ్ మహా నిమజ్జన వేడుకల (Ganesh Maha Immersion Celebrations) కోసం పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ మేరకు 29వేలమంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నట్లు ఆయన తెలిపారు.

విద్యుత్ తీగలు, చెట్లు తగలకుండా జాగ్రత్తలు

నిమజ్జన ఊరేగింపు ప్రధాన మార్గమైన బాలాపూర్ రూట్ ను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు. ఊరేగింపు వాహనాలకు చెట్లు, విద్యుత్ వైర్లు అడ్డు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు.

ఇందుకోసం నగరంలో 20వేలమంది పోలీసులతో పాటు, ఇతర జిల్లాల నుంచి 9వేల మంది సిబ్బందిన రప్పిస్తున్నట్లు సీపీ ఆనంద్ (CP Anand) చెప్పారు. వీరికి అదనంగా కేంద్ర బలగాలు కూడా సహకరిస్తాయని చెప్పారు. సెప్టెంబర్ 6న మిలాద్ ఉన్ నబి ఊరేగింపు, 14న మరోర్యాలీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన దృష్ట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Latest News

పహల్గాం దాడులతో మరింత కట్టుదిట్ట భద్రతలు

పహల్గాం ఉగ్రదాడులతో భారత్-పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధం జరిగింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు ఇంకా,కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నిమజ్జనానికి తగిన భద్రత కల్పించాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.

ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం,ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాటు చేయలేదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. గత 45 ఏళ్లుగా,కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గౌరవించి, యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తున్నది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/revanth-reddy-dont-drag-me-into-your-family-disputes-cm-revanth/news/540706/

Breaking News CV Anand Ganesh Chaturthi Ganesh Immersion 2025 ganesh maha nimajjanam Hyderabad Police latest news tank bund celebrations Telugu News Vinayaka Chavithi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.