📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Latest News: Accidents – మారిన రోడ్డు ప్రమాదవేళలు!

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఎక్కువ ప్రమాదాలు

హైదరాబాద్ : దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండం తెలిసిందే. ఈ ప్రమాదాలలో లక్ష 10వేల మందికి పైగా మరణిస్తుండగా నాలుగు లక్షలమందికి పైగా గాయపడుతుండడం విదితమే. రోడ్డు ప్రమాదాలు తెల్లవారుజామున ఎక్కువగా జరుగుతున్నట్లు ఇప్పటి వరకు వున్న నివేదికలు చెబుతుండగా తాజాగా కేంద్ర రహదారి, రవాణా శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. గడచిన మూడేళ్లుగా తెల్లవారుజామున జరిగే ప్రమాదాలు (Accidents) తక్కువగా వుండగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య జరుగుతున్న ప్రమాదాల సంఖ్య ఎక్కువగా వుంటోంది.

ఏడాదికి గానూ నిర్వహించిన సర్వేలో వెల్లడికాగా

మొత్తం ప్రమాదాలలో 38.4 శాతం ఈ ఆరు గంటల మధ్యే జరుగుతోందని కేంద్ర రహదారి, రవాణా శాఖ 2023 ఏడాదికి గానూ నిర్వహించిన సర్వేలో వెల్లడికాగా దీనికి సంబంధించి తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. 2024 లోనూ ఈ వేళల్లోనే ప్రమాదాలు ఎక్కువగా నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రోడ్డు ప్రమాదాలు ఎందుకు ఎక్కువగా జరుగుతుందనే దానిపై కేంద్ర రహదారి, రవాణా శాఖ (Central Road and Transport Department) అనేక అంశాలను అధ్యయనం చేయగా కొత్త విషయాలు వెలుగు చూశాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గం టల వరకు ఆఫీసుల్లో విధులు ముగించుకుని ఇంటికి చేరేవారి సంఖ్య ఎక్కువగా వుండడం ఒక కారణం.

Latest News

ఉద్యోగులు కార్యాలయాల నుంచి అలసటతో సొంత పనుల మీదవెళ్లి

ఇదే సమయంలో ఇళ్లకు చేరేందుకు ఆతృతగా వెళ్లేవారు ఎక్కువగా వుండడం మరో కారణం. కొన్నిసార్లు ఉ ద్యోగులు ఇళ్లకు చేరేసరికి రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పడుతుంది. కొందరు ఉద్యోగులు కార్యాలయాల నుంచి అలసటతో సొంత పనుల మీదవెళ్లి ఆలస్యంగా ఇళ్లకు వెళుతుండడం, ఇంకొందరు వేరే ప్రాంతాలకు వెళుతుండడం జరుగుతుంటుంది. అలసట కారణంగా ఈ సమయంలో డ్రైవిం గ్ చేయడం వల్ల దాని ప్రభావం శరీరంపై పడుతోందని. సరిగ్గా ఈ కారణాల వల్లే రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా వుంటోందని కేంద్ర రహదారి, రవాణా శాఖ పరిశీలనలో తేలింది.

2019తో గణాంకాలతో పోలి స్తే 2023 నాటికి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా వున్నాయి. కాగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు అనేక కారణాలున్నట్లు రహ దారి భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఇందులో మొదటిది ఆలసటతో డ్రైవింగ్ చేయడం వల్ల వాహనాల లైటింగ్పై వాహన దారులు దృష్టి సారిం చలేక పోవడం. ఇదే స మయంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాల లైటింగ్ మరో వాహనం డ్రైవర్ కళ్లలో పడడం. సరిగ్గా ఈ సమయంలో డివైడర్ లేదా మరేదైనా వాహనం వుంటే దానిని ఢీకొడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-deputy-cm-bhatti-implementation-of-annual-loan-plan-is-good/telangana/543859/

Accident Statistics Breaking News Fatalities hyderabad india latest news road accidents road safety Telugu News traffic accidents Transport Ministry Survey

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.