Human trafficking : హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులకు అందిన పక్కా సమాచారం ఆధారంగా సుమిత్రనగర్ ప్రాంతంలోని కొన్ని అపార్ట్‌మెంట్లలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించారు.
ఈ సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు దాడుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను అలాగే అక్కడికి వచ్చిన ఇద్దరు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: David Reddy Movie: ‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా
దాడి సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని ప్రభుత్వ హోమ్ కు తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు నగరంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: