📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: Kompally:చిట్టీల పేరిట ఆర్ఎంపి వైద్యుడు కోట్లాది రూపాయల మోసం

Author Icon By Sushmitha
Updated: October 18, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (కొంపల్లి):(Kompally) చిట్టీల పేరిట ఆర్ఎంపి వైద్యుడు కోట్లాది రూపాయల మోసం పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కట్టిన అమాయకులను మోసం చేసిన సంఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. మియాపూర్ పరిధిలోని మయూరినగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అలీ, అతని అకౌంటెంట్ మహేశ్ చిట్టీల పేరుతో కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారు. నిజాంపేటలో రేష్మా క్లినిక్ పేరుతో గత 20 సంవత్సరాలుగా దవాఖానా నడుపుతున్న అలీ, సైడ్ బిజినెస్‌గా చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు. క్రమంగా ఈ చిట్టీల విలువ రూ.50 లక్షలు, రూ.30 లక్షలు, రూ.20 లక్షల వరకు చేరింది. సుమారు 150 మంది కస్టమర్లు ఇతని వద్ద చిట్టీలు వేశారు.

Read also: Krishna Chaitanya: పంచారామాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్

Kompally

బాధితుల ఆందోళన, నిందితుల పరార్

గత రెండేళ్లుగా చిట్టీలు(Chitties) ఎత్తుకున్న వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో కస్టమర్లలో ఆందోళన మొదలైంది. దీంతో ఆర్ఎంపీ వైద్యుడు అలీపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 8న క్లినిక్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిబ్బంది, కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స చేయించారు. అనంతరం కోలుకున్న అలీ ఈ నెల 14 నుంచి మళ్లీ క్లినిక్‌కు వస్తుండటంతో బాధితులు చిట్టీల డబ్బుల కోసం క్యూ కట్టారు. ఈ క్రమంలో చిట్టీల నిర్వాహకుడు అలీ, అతని అకౌంటెంట్ మహేశ్ మధ్య వివాదం నడుస్తోంది. మహేశ్ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి అదృశ్యమయ్యాడు.

పరస్పర ఫిర్యాదులు, పోలీసులు దర్యాప్తు

గురువారం సాయంత్రం పెద్ద సంఖ్యలో బాధితులు రేష్మా క్లినిక్ వద్దకు చేరుకుని అలీని నిలదీశారు. దీంతో తనను అకౌంటెంట్ మహేశ్ మోసగించాడని అలీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధితులు మాత్రం అలీ తమను మోసగించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు బాధితులు మాట్లాడుతూ, “మా అమ్మ ఇల్లు అమ్మేసి చిట్టీలు వేసింది, మాకు రూ.11 లక్షలు రావాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు నష్టపోయిన మొత్తంపై పోలీసులు ఈఓడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం)కు అప్పగిస్తామని తెలిపారు. మహేశ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిట్టీల మోసం ఎక్కడ జరిగింది?

హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలోని మయూరినగర్, నిజాంపేట ప్రాంతాల్లో జరిగింది.

చిట్టీల వ్యాపారం నిర్వహించిన వ్యక్తి ఎవరు?

రేష్మా క్లినిక్ నడుపుతున్న ఆర్ఎంపీ వైద్యుడు అలీ.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Bachupally police. Chit fund scam financial fraud Google News in Telugu Hyderabad crime Latest News in Telugu RMP doctor Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.