📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: Komatireddy Venkat Reddy: తేమ నిబంధన సడలించి పత్తి రైతుల కష్టాలు తీర్చండి

Author Icon By Sushmitha
Updated: October 29, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణలోని పత్తి రైతుల సమస్యలు, తేమ శాతం సడలింపు, కనీస మద్దతు ధర (MSP) పెంపు వంటి అంశాలపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) కీలక విజ్ఞప్తి చేశారు. మంగళవారం ముంబైలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Cotton Corporation of India) (సీసీఐ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను ఆయన ప్రత్యేకంగా కలిసి గంటపాటు చర్చించారు.

 Read Also: Rain Alert: కోస్తా అలర్ట్! కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావం

తేమ శాతం సడలింపు, ధరల పెంపు డిమాండ్

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, దీర్ఘకాల నైరుతి వానా కాలం మరియు తుఫానుల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులలో గరిష్టంగా 23% వరకు తేమ ఉంటుందని మంత్రి వివరించారు. పత్తిలో కూడా తేమ శాతం పెరిగిందని, అయితే ప్రస్తుత నాణ్యత ప్రమాణాల ప్రకారం నిర్దేశించిన 8-12 శాతం తేమ ఎఫ్‌ఏక్యూ (FAQ) పాటించడం అసాధ్యమని స్పష్టం చేశారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు తేమ శాతాన్ని తక్షణమే 14 శాతం వరకు సడలించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, వ్యవసాయ సాగు పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధరను కూడా సవరించాలని ఆయన కోరారు.

కొనుగోలు కేంద్రాల విస్తరణ, ప్రత్యేక ప్యాకేజీ

అన్ని పత్తి పండించే జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను విస్తరించి, ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ నుండి రైతులను కాపాడాలని మంత్రి సూచించారు. గులాబీ తెగులు సోకి, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ అందించాలని, అలాగే పసుపురంగు వచ్చిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని కోరారు. గత సీజన్లలో సేకరించిన పత్తికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వెంట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ఉన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీసీఐ ఛైర్మన్ లలిత్ కుమార్ గుప్తా, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరిని కలిశారు?

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను కలిశారు.

పత్తికి తేమ శాతాన్ని ఎంతవరకు సడలించాలని మంత్రి కోరారు?

ప్రస్తుతం ఉన్న 8-12 శాతం నుంచి తక్షణమే 14 శాతం వరకు సడలించాలని కోరారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

CCI Cotton Corporation of India cotton farmers Google News in Telugu komatireddy venkat reddy Latest News in Telugu moisture content relaxation. MSP Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.