జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) స్పందించారు. ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా రాకపోయినా, ఈ ఎన్నికలో బీఆర్‌ఎస్ నైతికంగా గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Akhanda 2: రిలీజ్ సందిగ్ధం.. సంక్రాంతికి బాలయ్య–చిరు బరిలోకి వచ్చే ఛాన్స్?
కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ
పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్(KCR) మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా నిరుత్సాహపడాల్సిన పనిలేదని, మరింత ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ బెదిరింపులు, అక్రమ పద్ధతులు, దుర్వినియోగాలు చేయడం ద్వారా విజయాన్ని సాధించిందని ఆయన విమర్శించారు.
రాబోయే రోజుల్లో ప్రజల సమస్యల కోసం బీఆర్‌ఎస్ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని కేసీఆర్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ తిరిగి బలపడుతుందని, బీఆర్‌ఎస్ మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: