జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jublieehills Elections) ఫలితాలు ఇంకా వెలువడకముందే, కాంగ్రెస్(Congress) విజయోత్సాహం ప్రారంభమైంది. నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ విజయం స్పష్టమవడంతో, పార్టీ నేతలు రాత్రి నుంచే సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయాలు, స్థానిక నేతల ఇళ్ల వద్ద పటాకులు పేల్చి, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ విజయానికి తమ వర్గం సహకారం అందించిందని చెబుతూ, కమ్మ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బీ. రవిశంకర్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్‌లో ధన్యవాద సభ నిర్వహిస్తున్నారు. ఇందులో సంఘ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొననున్నారు.
Read Also: Tejashwi Yadav:బిహార్‌లో మాహాఘట్బంధన్ గెలుపు ఖాయం
మంత్రి తుమ్మల పాత్రపై చర్చ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో(Jublieehills Elections) కమ్మ ఓట్లను ఏకం చేయడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన సమన్వయంతోనే ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పగలిగామని నేతలు భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. తుది ఫలితాలు వెలువడకముందే పార్టీ నేతలు “జూబ్లీహిల్స్ నుంచి విజయం తెలంగాణలో మార్పు సంకేతం అవుతుంది” అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: