జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో(Jubilee Hills)కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రతిస్పందన పరోక్షంగా దృష్టిని ఆకర్షించింది. బైఎలక్షన్ ఫలితాలు వెల్లడైన వెంటనే ఆమె “కర్మ హిట్ బ్యాక్” అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యను ఆమె బీఆర్ఎస్‌పై లక్ష్యంగా పెట్టుకుని చేసినదే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Alubukhara Fruits : ఆలుబుఖర పండ్లను రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Jubilee Hills: ఇటీవలి రోజులుగా కవితకు బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదాలు తీవ్రం కావడంతో పార్టీ ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలతో బీఆర్ఎస్ ఆమెపై చర్య తీసుకుంది. సస్పెన్షన్ తర్వాత కవిత పూర్తిగా ‘జాగృతి జనం బాట’ యాత్రపై దృష్టి పెట్టి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుతో తనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఆమె బహిరంగంగానే పేర్కొన్న విషయం తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత తన కార్యకలాపాలను జాగృతి ప్లాట్‌ఫారమ్ ద్వారా మరింత చురుకుగా కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: