గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధమవుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం వెల్లడించారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో కేపీహెచ్‌బీలో జరిగిన(Janasena) సమావేశంలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Indira Gandhi: ఆమె ఓ అసమానత వనిత .. కాంగ్రెస్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్ మాట్లాడుతూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తల శక్తిని సమన్వయం చేసి జనసేనను(Janasena) ప్రజల్లో మరింత చేరువ చేయాలని సూచించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రేమ్‌కుమార్, వీరమహిళ చైర్మన్ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :