📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

News Telugu: Inspections: నర్సింగ్ కాలేజీలపై కొరడా

Author Icon By Rajitha
Updated: October 16, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Inspections: రాష్ట్రమంతా రెండో రోజున సాగిన తనిఖీలు హైదరాబాద్ (Hyderabad) : ప్రైవేటు నర్సింగ్ కళాశాలల అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఈ) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీలు రెండో రోజు కూడా కొనసాగాయి. 21 కాలేజీలపై ఆరోపణలు రాగా.. వాటన్నింటిలోనూ విస్తృతంగా విచారణ జరిపి నివేదికలను డీఎంఈ కార్యాలయంలో అందించారు. విచారణ అధికారులు అందించిన నివేదికలను డీఎంఈ పరిశీలన అనంతరం చర్యలు తీసుకోనున్నారు. ఒకే భవనంలో అనేక కాలేజీలను నిర్వహించడం సహా. చాలా చోట్ల గుర్తింపు తీసుకున్న అడ్రస్ లో భవనాలు లేవని, సగం నర్సింగ్ కళాశాలలకు పేరెంట్ హాస్పిటల్స్ లేవని డీఎంఈకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ కొనసాగింది. క్లినికల్ ప్రాక్టీస్ లేకుండానే నర్సింగ్ విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న దుస్థితికి కారణమైన ఈ కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నర్సింగ్ (Nursing) కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు తనిఖీలు పూర్తి చేసి నివేదికలను ఒక్కొక్క బృందం డీఎంఈ కార్యాలయంలో అందచేసినట్లు అధికారులు తెలిపారు. చాలా కళాశాలల్లో విద్యార్థులు, ఫ్యాకల్టీ కూడా కనిపించలేదని విచారణ చేపట్టిన అధికారులు కొందరు తెలిపారు.

Telangana: పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం

Inspections

చాలా కళాశాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పాటు రోజువారీగా క్లాసులు చెప్పే పరిస్థితి కూడా లేదన్నారు. ఇక తనిఖీలకు (Inspections) వెళ్లిన వారిలో కొందరిని ప్రైవేటు కళాశాలలు యాజమాన్యాలు మచ్చిక చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అలాంటి వారిపైన ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితి ఉన్న చోట అవసరమైతే మరోసారి విచారణ చేపట్టేందుకు ఇతర బృందాలను పంపించేందుకు కూడా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. వ్యవస్థను సరిచేసేందుకు ఈ వ్యవస్థను నిర్వహించే వారు సక్రమంగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 21 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలను నిబంధనం మేరకు నిర్వహించడం లేదని, ఒకచోట అనుమతితో మరోచోట నిర్వహిస్తున్నారని, మౌలిక వసతులు లేవని, ఫ్యాకల్టీ లేకుండానే >>2 కాలేజీలే నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వచ్చినట్లు డిఎంఈ (అకడమిక్స్) డాక్టర్ శివరాం ప్రసాద్ చెబుతున్నారు. 21 కాలేజీలపై విచారణ కోసం 42 మందితో కూడిన బృందాలను పంపించి విచారణ చేయించామని పేర్కొన్నారు. గత ఏడాది ఇలాగే ఆరోపణలు వచ్చిన సందర్భంలో విచారణ తర్వాత ఓ నర్సింగ్ కాలేజీ గుర్తింపు రద్దు చేసి విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేశామని, ఇప్పుడు కూడా నిబంధనల మేరకు లేని కాలేజీలపై డిఎంఈ స్థాయిలో లేదా హెల్త్ సెక్రటరీ స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎంత కాలేజీలపై తనిఖీలు జరుపుతున్నారు?
రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు.

తనిఖీల కోసం ఎన్ని బృందాలను పంపారు?
42 మందితో కూడిన బృందాలను 21 కాలేజీలపై విచారణ జరపించేందుకు పంపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

complaints DME inspections irregularities latest news Nursing colleges Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.