ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 27 ప్రభాతవార్త :
Ibrahimpatnam: తప్పిపోయిన ఏడేళ్ల బాలికను పోలీసులు కేవలం అరగంటలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా చిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన అంజలిరాజు దంపతుల కుమార్తె ఆద్య ( 7 ). ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న తన పిన్నిని చూడటానికి ఆద్య తన తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. ఈ క్రమంలో ఆ బాలిక ఆడుకుంటూ బయటకు వెళ్లి తప్పిపోయింది.
Read Also:Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్
ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా ఎస్ఐ సుమలత, ఏఎస్ఐ సతీష్ కుమార్ వెంటనే స్పందించి గాలింపు చేపట్టారు. అరగంట వ్యవధిలోనే ఆద్యను సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఆ తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: