📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

iBOMMA Ravi: రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

Author Icon By Shiva
Updated: December 6, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(వార్త న్యూస్ నెట్వర్క్)

ఐ బొమ్మ రవి(iBOMMA Ravi) సాంకేతిక పరిజ్ఞానం చూసి పోలీసులకే మైండ్ బ్లాoక్ అవుతున్నట్టు సమాచారం. కంప్యూటర్ నెట్వర్క్ విధానాన్ని రవి పూర్తిస్థాయిలో అవపాసన పెట్టాడు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఒక సైబర్ క్రైమ్(Cyber crime) విషయంలో రవిని ప్రశ్నించగా కేవలం ఐదు నిమిషాల్లో ఆ కేసును పరిష్కరించి పోలీసులు ముందు పెట్టినట్లు సమాచారం. ఇంత సులువుగా కేసులను పరిష్కరించగలిగే నైపుణ్యత రవికి ఉందని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఐపీఎస్ అధికారులు సైతం ఐ బొమ్మ రవి పరిజ్ఞానాన్ని చూసి విస్మయం చెందినట్లు సమాచారం దీనితో అతనిని పోలీసు విభాగం సాంకేతికంగా ఉపయోగించుకోవాలని ఆలోచించడమే కాకుండా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Read Also: iBOMMA: రవిపై మరో 3 కేసులు, 14 రోజుల రిమాండ్

Ravi has a job in the police department DCP gives clarity

సినిమాల పైరసీ, కంప్యూటర్ల హ్యాకింగ్ తో పాటు కంప్యూటర్ నెట్వర్కింగ్(Computer Networking) పై విశేష పరిజ్ఞానం కలిగిన ఐ బొమ్మ రవిని పోలీసులు సాంకేతికంగా అద్భుతాలు సృష్టించాడని తెలుస్తోంది. ఐ బొమ్మ రవి(iBOMMA Ravi) సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సినిమా రంగ ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మన దేశానికి దూరంగా ఎక్కడో దీవుల్లో తిష్ట వేసి తెలుగు సినిమా రంగానికి సంబంధించిన పైరసీతో ఇప్పటికే కోట్లు గడించాడు. చివరికి చిన్న పొరపాటు చేసి మనదేశంలోనే హైదరాబాద్లో అతనిని పోలీసులు పట్టుకోగలిగారు.

ఐబమ్మ రవి కున్న సాంకేతిక పరిజ్ఞానం

ఇది ఐ బొమ్మ రవికి ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. పోలీసుల కస్టడీలో ఐబమ్మ రవి కున్న సాంకేతిక పరిజ్ఞానం పోలీసు శాఖలోని సైబర్ నిపుణులకు సైతం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఈ సమయంలో ఐ బొమ్మ రవి పరిజ్ఞానాన్ని మంచిది ఉపయోగించుకుందామని పోలీసులు వ్యూహాన్ని రచించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసు అధికారులు కొట్టివేస్తున్నారు. ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన వార్తలు నిజం కాదని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు క్లారిటీ ఇచ్చారు. అవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలేనని పేర్కొన్నారు.

3 బెట్టింగ్ యాప్‌ ప్రమోట్

ఐబొమ్మ రవికి తాము ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదని డీసీపీ తెలిపారు. 8 రోజుల కస్టడీలో రవి కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పాడని ఆయన అన్నారు. తప్పు చేశాననే బాధ రవిలో అసలు కనిపించలేదన్నారు. అతను 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు తాము గుర్తించామని ఆయన పేర్కొన్నారు. రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపారు.

ఐ బొమ్మ రవిని సమాజంలో ఒక వర్గం మద్దతు పలకడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అతను చేసింది నేరమే కానీ సామాన్యులకు ఆయన సినిమాలను దగ్గర చేశాడని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మల్టీప్లెక్స్ లు, ఫ్యాన్ ఇండియా సినిమాల పేరుతో జరుగుతున్న దోపిడీ తో మధ్యతరగతి, సామాన్యు కుటుంబాలు వినోదానికి దూరం అవుతున్నారు. ఇకనైనా చాలా చిత్ర ప్రముఖులు తమ వైఖరిని మార్చుకోకపోతే మరో వందమంది ఐ బొమ్మ రవిలు పుట్టుకొస్తారని సామాన్యంగా చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేయడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Cyber Crime Investigation Cybercrime DCP Aravind Babu iBomma Piracy Case Ibomma Ravi Police Job Rumours Telugu movie piracy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.