iBOMMA రవి అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ వెస్ట్‌జోన్ DCP కవిత కీలక వివరాలు వెల్లడించారు. రవికి అతడి కుటుంబ సభ్యులతో ఎలాంటి పరిచయాలు లేవని ప్రారంభ దర్యాప్తులో తెలిసిందని ఆమె తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటున్న రవి సన్నిహితుడి గురించి సమాచారం రావడంతో, పోలీసులు అతడిని ట్రేస్ చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో రవి ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా సందేశం రావడం కేసులో కీలక మలుపు తీసుకువచ్చిందని కవిత చెప్పారు.
Read Also: Moaist Encounter: హిడ్మాపై రూ.6 కోట్ల రివార్డ్
ఆ సందేశంలో తాను ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్నానని రవి తెలిపిన వెంటనే, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. అరెస్టు తర్వాతే రవికి కుటుంబం ఉన్నట్లు అధికారులకు తెలిసినట్లు DCP కవిత స్పష్టం చేశారు. iBOMMA రవి కేసు పై దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: