📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Hyderabad: పెద్ద గురువులు లేని వర్సిటీలు! 70%పైగా అధ్యాపకుల ఖాళీలు

Author Icon By Tejaswini Y
Updated: November 13, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad: నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి పౌరులు సమాజంపై అవగాహన కల్పించుకొని.. మంచి పౌరులుగా ఎదిగేది యూనివర్సిటీ విద్య ద్వారా, ఆటువంటి యూనివర్సిటీ విద్యను బోధించడానికి విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు కరువయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ యూనివర్సిటీల్లో 70 శాతానికి పైగా ఆచార్యుల కొరత ఉంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఆసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం గత పదమూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. నాణ్యమైన విద్యను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నప్పటికీ ఆచరణలో ఇటువంటి ఇబ్బందల మూలంగా అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

Read Also: TG: తెలంగాణలో ఇంటర్నేషనల్ ఫిషరీస్‌ హబ్‌ ఏర్పాటు

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోనే కాదు.. అనేక ప్రభుత్వ విద్యా సంస్థ ల్లో బోధనా సిబ్బంది ఖాళీలుగా భారీగానే ఉన్నాయి. పాఠశాల విద్య స్థాయి నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ స్థాయి వరకు అధ్యాపకుల ఖాళీలున్నాయి. బోధించే వారేలేకపోతే.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ కొద్ది రోజుల క్రితం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, తెలంగాణ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలాగా తయారు చేయాలని అధి కారులను ఆదేశించారు.

తమ ప్రభుత్వం విద్యశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కానీ వాస్తవంగా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రాష్ట్రంలోని పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, యూనివర్సిటీ స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆధ్యాపక ఖాళీలు భారీగా ఉన్నాయి. 26,0167 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఉంటే వాటిల్లో సుమారు 15వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉంటే వాటిల్లో సుమారు 500కి పైగా జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Hyderabad: 130 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 4200 అధ్యాపక పోస్టులు మంజూరైతే ప్రస్తుతం 1600 మంది రెగ్యులర్ లెక్చరర్లు కొనసాగుతున్నారు. ఇక యూనివర్సిటీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 11 యూనివర్సిటీల్లో 2878 అధ్యాపక పోస్టులు మంజూరు కాగా వాటిల్లో ప్రస్తుతం 753 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు కొనసాగుతున్నారు. మిగిలిన 2125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మొత్తం కలిపి 2878 పోస్టులు మంజూరు చేయగా.. వాటిలో కేవలం 753 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మంజూరైన ప్రొఫెసర్ పోస్టుల్లో ఉస్మానియా, తెలంగాణ, జేఎన్టియు హెచ్, జెఎన్ఎస్ఏయూలో మాత్రమే రెగ్యులర్ ప్రొఫెసర్లు 11 ఉన్నారు. మిగిలిన కాకతీయ, మహాత్మాగాంధీ, శాతావాహన, పాల మూరు, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆర్కై యుకేటిల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. అసోసియేట్ ప్రొఫెసర్లతోపాటు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లోనూ ప్రొఫెసర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వరకు ఖాళీలున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటైన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి, ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఎర్టెన్స్ యూని వర్సిటీల్లోనూ కొత్తగా నియామకాలను చేపట్టలేదు. కొద్దిరోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో కెరీర్ అడ్వాన్స్ స్కీమ్(సీఏఎస్) లో భాగంగా ఆసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించారు. దీంతో ఇప్పటికే ఉన్న అసిస్టెంట్, అసోసియేట్ ఖాళీలకు ఆదనంగా మరో 20 నుంచి 30 ఖాళీలు ఏర్పడ్డాయి.

రాష్ట్రంలోని స్టేట్ యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి 2017లోనే సుమారు 1000కి పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 8 సంవత్స రాలుగా నియామక ప్రక్రియ ప్రారంభం కాకుండా ఎక్కడ వేసిన గొంగడి ఆక్కడే అన్నట్టుగా నియామక ప్రక్రియ నిలిచిపోయింది. నియామకాల కోసం నియామక బోర్డును గత ప్రభుత్వం తీసుకురావాలని భావించిన “ప్పటికీ అందుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో నియామక బోర్డు ఏర్పాటు ఆగిపోయింది. ఆ తరువాత 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీని ఇప్పటి వరకు చేపట్టలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CM Revanth Reddy Education Review Education in Telangana Osmania University Teachers Vacancies Telangana universities University Jobs Telangana University Professors Shortage

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.