Hyderabad transport project: హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు.. నగర వాసులకు ఊరట

Read Time:  1 min
Hyderabad transport project: హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు.. నగర వాసులకు ఊరట
FONT SIZE
GET APP

Hyderabad transport project: హైదరాబాద్‌లో పెరిగిన జనాభా, వాహనాల రద్దీతో నగరవాసులు ట్రాఫిక్ నరకాన్ని చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు రైల్వే శాఖ అనుమతిని ఇచ్చింది.

Read Also: Rohit Reddy Drugs Case: కేసీఆర్ ఆదేశాలతో రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్

Hyderabad transport project: హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు.. నగర వాసులకు ఊరట
Hyderabad Transport Project: Ring Rail Around Hyderabad Relief for City Residents

ఇటీవల లోక్‌సభలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు, ఈ సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఏదైనా పెద్ద ప్రాజెక్టు మొదలవ్వాలంటే ముందుగా ‘డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్’ (DPR) సిద్ధం చేయాలి. ఈ డీపీఆర్ తయారు చేయాలంటే క్షేత్రస్థాయిలో సర్వే తప్పనిసరి. ఇప్పుడు కేంద్రం ఈ సర్వేకు అనుమతించడంతో ప్రాజెక్టు, రైల్వే లైన్ ఎటువైపు నుంచి వెళ్లాలి, అయ్యే ఖర్చు ఎంత వంటి సాంకేతిక అంశాలపై స్పష్టత రానుంది.

రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైల్

రోడ్డుకు సమాంతరంగా రైలు మార్గం ఈ రీజినల్ రింగ్ రైల్, ప్రస్తుతం ప్రతిపాదిత దశలో ఉన్న రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కు దాదాపు సమాంతరంగా ఈ రైల్వే లైన్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే అటు రోడ్డు మార్గం, ఇటు రైలు మార్గం రెండూ అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. అలైన్‌మెంట్ విషయంలో రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత పనులు వేగవంతం కానున్నాయి.హైదరాబాద్ (Hyderabad )నగరానికే కాకుండా చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి, గజ్వేల్, యాదాద్రి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్ , చేవెళ్ల వంటి ప్రాంతాలకు భారీగా ప్రయోజనం కలుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.