Hyderabad: తార్నాక ఆర్టిసి ఆస్పత్రికి NABH ఎంట్రీలెవెల్ గుర్తింపు

Read Time:  1 min
Hyderabad: తార్నాక ఆర్టిసి ఆస్పత్రికి NABH ఎంట్రీలెవెల్ గుర్తింపు
FONT SIZE
GET APP

Hyderabad : తార్నాకలో ఉన్న ఆర్టిసి ఆసుపత్రి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఎబిహెచ్) గుర్తింపు పొందింది. నాణ్యమైన వైద్య సేవలు, రోగి ఆరోగ్య భద్రతను నిర్ధారించే దిశగా ఆసుపత్రి చేస్తున్న నిరంతర కృషికి ఇదొక మైలురాయిగా నిలువనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సదుపాయాల, వైద్య సేవల బలోపేతం, సేవా ప్రమాణాల మెరుగుదల కోసం కృషి చేస్తోంది. అధునాతన అత్యవసర, క్రిటికల్ కేర్ సేవలు, మాడ్యులర్ సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ థియేటర్లు, పూర్తిస్థాయి క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేసి వివిధ రకాల చికిత్స సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read Also: Telangana: నేడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

Hyderabad: Tarnaka RTC Hospital gets NABH entry level recognition
Hyderabad: Tarnaka RTC Hospital gets NABH entry level recognition

జనరల్ మెడిసిన్లో డీఎన్బీ పీజీ కార్యక్రమాలు

ఈ సదుపాయాలు రోగులకు సమయానుకూలంగా, సురక్షితంగా ప్రత్యేక వైద్య సేవలను అందించడానికి సహాయపడుతున్నాయి. ఆసుపత్రి విద్యా, శిక్షణ కార్యక్రమాలను కూడా విస్తరించింది. 100 సీట్ల బీఎస్సీ నర్సింగ్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, శస్త్రచికిత్స, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్లో డీఎన్బీ పీజీ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఆర్టీసి ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన సురక్షిత వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తోంది. వైద్యుల సమష్టి కృషి, పట్టుదల, అత్యుత్తమైన ఆరోగ్య సేవల్ని సాధించాలనే అచంచలమైన సంకల్పానికి ఇది నిదర్శనం ఆర్టీసి ఎండి నాగిరెడ్డి అని కొనియాడారు. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు, అర్హులైన వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవల్ని కొనసాగించాలని సూచించారు.

ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్ఏబిహెచ్ సర్టిఫికేషన్ పొందడం చాలా సంతోషంగా ఉందని, ఇది అందరి కృషితోనే సాధ్యమైందని తార్నాక ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్రీమతి శైలజామూర్తి పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు, నాణ్యత ప్రమాణాలకు ఇది ఒక గుర్తింపుగా నిలు స్తుంద న్నారు. ఎంట్రీ లెవల్ సర్టిఫికేషన్ విశ్వసనీయతను పెంచుతుందని, అంత ర్గత ప్రక్రియలను బలోపేతం చేయాలన్నారు. తార్నాక ఆర్టీసి ఆసుపప్రతికి ఎన్ఎబిహెచ్ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ శైలజ మూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పి శ్రీనివాస్ ఇతర వైద్య బృందాన్ని ఆర్టీసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.