📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Hyderabad Metro: హైదరాబాద్ సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణ..రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

Author Icon By Anusha
Updated: July 20, 2025 • 1:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక దశలోకి ప్రవేశించింది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు అత్యవసరమవుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను వేగవంతం చేస్తోంది. విస్తరణకు కేంద్ర అనుమతులు త్వరితగతిన పొందాలనే ఉద్దేశ్యంతో శనివారం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో ఎంపీలకు ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సును హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఆధ్వర్యంలో నిర్వహించగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో, మెట్రో విస్తరణకు కేంద్రం మద్దతు కూడగట్టడం అత్యంత ముఖ్యమని అధికారులు, మంత్రులు పేర్కొన్నారు. దీనికై పార్టీలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీలను కోరారు.

మెట్రో రెండో దశ విస్తరణను

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు, HAML ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రైలు ప్రతిపాదిత విస్తరణ కారిడార్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు సమగ్ర అవగాహన కల్పించారు.మెట్రో రెండో దశ విస్తరణను 2ఏ, 2బీ అనే రెండు భాగాలుగా ప్రతిపాదించినట్లు వివరించారు. 2ఏ కింద ఐదు కారిడార్లు, 76.4 కి.మీ. పొడవుతో రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీనికి సంబంధించిన డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక) ఇప్పటికే గత నవంబర్‌లో కేంద్రానికి పంపినట్లు చెప్పారు. 2బీలో మూడు కారిడార్లు, 86.1 కి.మీ. పొడవుతో రూ.19,579 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. దీని డీపీఆర్‌లను జూన్ 21న కేంద్రానికి సమర్పించినట్లు ఎన్వీఎస్ రెడ్డి ఎంపీలకు వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Hyderabad Metro: హైదరాబాద్ సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణ..రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

కేంద్రానికి ప్రతిపాదనలు

గత ప్రభుత్వం మెట్రో రెండో దశపై శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని 2ఏ, 2బీ కేటగిరీలుగా విభజించి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా మంజూరు చేయాలని కోరుతూ ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నట్లు ఆయన వెల్లడించారు.సదస్సులో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, సురేశ్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్‌తోపాటు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. మెట్రో విస్తరణ ప్రాజెక్ట్ హైదరాబాద్ భవిష్యత్ రవాణా అవసరాలకు అత్యంత కీలకమని, కేంద్రం నుంచి సత్వర అనుమతులు లభిస్తే పనులు వేగవంతం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

హైదరాబాద్ మెట్రో 24 గంటలు పనిచేస్తుందా?

కాదు, హైదరాబాద్ మెట్రో రైలు 24 గంటలు పనిచేయదు. ఇది ప్రతి రోజు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు?

హైదరాబాద్ మెట్రో రైలును అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు అమలు కోసం లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్ (L&T) కంపెనీకి బాధ్యత అప్పగించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: TG Secretariat: తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..

Batti Vikramarka Breaking News HAML Hyderabad Metro Phase 2 komatireddy venkat reddy latest news Metro Expansion NVS Reddy Revanth Reddy Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.