Hyderabad: హైదరాబాద్ నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న యాదయ్య, లక్ష్మి దంపతుల పిల్లల అఖిల్, ప్రణీత్ అగ్ని ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రాణాలతో వస్తారనే ఆశతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. బడికెళ్లినా బిడ్డలు బతికేవాళ్లంటూ గుండెలవిసేలా రోదించారు.
Read Also: Vikarabad crime: అప్పుల భారం తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య
మంటలు వ్యాపించిన సమయంలో
సెల్లార్‌లో మంటలు వ్యాపించిన సమయంలో ఇనుప గ్రిల్ తాళం వేసి మూసివేసి ఉండడంతో, పిల్లలు గదిలో మూలకు వెళ్లి కూర్చొని పొగ కారణంగా ప్రాణాలను(Kids Death) కోల్పోయారు. ఈ ప్రమాదంలో వారిని కాపాడేందుకు ప్రయత్నించిన సేల్స్‌మెన్ మహ్మద్ ఇంతియాజ్, ఆటో డ్రైవర్ సయ్యద్ హబీబ్ కూడా మంటల్లో చిక్కి మరణించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలన జరిపారు. ఇప్పటి వరకు ప్రమాదానికి కారణమైన ఫ్యాక్టర్లు, భద్రతా ప్రమాణాలపై విచారణ కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: