📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు

Telugu news: Hyderabad: ఫ్యూచర్ టెక్ హబ్‌ తో భూముల ధరలకు రెక్కలు

Author Icon By Tejaswini Y
Updated: December 12, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad real estate: ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్(Hyderabad) నగరాన్ని చెప్పుకుంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి పశ్చిమ ప్రాంతాలే ముందుగా గుర్తుకు వచ్చేవి. ప్రధాన ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు అన్నీ అక్కడే స్థాపించడంతో ఆ ప్రాంతం అత్యంత రద్దీగా మారింది. రియల్ ఎస్టేట్ రేట్లు కూడా భారీగా పెరగడంతో కొత్త ప్రాజెక్టులకు స్థలం దొరకటం కష్టమైంది. ఈ పరిస్థితుల్లో నగర అభివృద్ధి దిశ మెల్లగా దక్షిణ భాగం వైపుకు మారుతోంది. త్వరలో హైదరాబాద్‌లో అత్యధిక డెవలప్‌మెంట్ సౌత్ జోన్‌లోనే జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం బలపడుతోంది.

Read Also: Hyderabad Aquarium: రూ. 300 కోట్లతో భారీ టన్నెల్ అక్వేరియం

తుక్కుగూడ పరిసరాల్లో భూముల ధరలు పెరుగుదల

దీనికి ప్రధాన కారణం తుక్కుగూడ సమీపంలోని 900 ఎకరాల ఫ్యాబ్ సిటీ. ‘తెలంగాణ రైజింగ్ 2047(Telangana Rising 2047)’ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని భారీగా అభివృద్ధి చేస్తోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ స్టోరేజ్ రంగాలకు ఇది నెక్స్ట్-జెన్ టెక్ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. పెద్ద పరిశ్రమలు, అంతర్జాతీయ పెట్టుబడులు రాకతో సుమారు 15,000 ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలో మాదాపూర్, గచ్చిబౌలి ఎలా రూపాంతరం చెందాయో, ఆ స్థాయికి మించి ఇక్కడ అభివృద్ధి జరిగే అవకాశముందని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

సౌత్ హైదరాబాద్ కొత్త రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్

దక్షిణ హైదరాబాద్‌కు మరో పెద్ద ప్రయోజనం ముందుగానే ఉన్న మౌలిక సదుపాయాలు. ORR కనెక్టివిటీ అత్యుత్తమంగా ఉండటం, ఎయిర్‌పోర్ట్‌కు 15 నిమిషాల్లో చేరే అవకాశం ఉండటం ఇవన్నీ ఈ ప్రాంతాన్ని అత్యంత ఆకర్షణీయంగా మారుస్తున్న అంశాలు. ట్రాఫిక్ జామ్‌లు, రోడ్డు సమస్యలు ఉన్న పాత ఏరియాలతో పోలిస్తే ఇక్కడ ప్లాన్ చేసిన నగరీకరణకు బాగా అవకాశాలు ఉన్నాయి.

Hyderabad Land prices soar with Future Tech Hub

ప్రస్తుత కాలంలో ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు రద్దీ నగర జీవితం నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండే ప్రదేశాల కోసం చూస్తున్నారు. విశాలమైన ఇళ్లు, ప్రకృతి మధ్యలో ఉండే జీవనం, తాజా గాలి, పచ్చదనం ఇవే ఇప్పుడు వారికి అసలైన లగ్జరీ. అందుకే దక్షిణ హైదరాబాద్‌లో ప్లాటెడ్ డెవలప్‌మెంట్స్, ఇండిపెండెంట్ విల్లాస్, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి డిమాండ్ పెరుగుతోంది.

ఫ్యాబ్ సిటీ ప్రభావం

ఫ్యాబ్ సిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో బిజినెస్ పార్కులు, కమర్షియల్ హబ్‌లు రూపుదిద్దుకునే చాన్స్ ఉంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంస్థలు తుక్కుగూడ, శంషాబాద్, రింగ్ రోడ్ పరిసరాల్లో ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాయి. రోడ్డు మౌలిక సదుపాయాలు మెరుగుపడే కొద్దీ ఈ ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Fab City Hyderabad Hyderabad Real Estate South Hyderabad development Telangana Rising 2047 Tukkuguda growth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.