Free Mutton Haleem Kondapur: రంజాన్ మాసం కావడంతో నగరంలో హలీమ్ సందడి మొదలైంది. ఈ క్రమంలో కొండాపూర్‌లోని ‘వాహ్ మండి’ (Wah Mandi) రెస్టారెంట్ చేసిన ఒక ప్రకటన స్థానికంగా పెద్ద అలజడికి దారితీసింది.
Read Also: Sangareddy Road Accident: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కంటైనర్!
ఏం జరిగింది?
ప్రచారంలో భాగంగా తమ సంస్థ వద్ద ఉచితంగా మటన్ హలీమ్ పంపిణీ చేస్తామని వాహ్ మండి సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ వార్త వైరల్ కావడంతో, హలీమ్ కోసం వందలాది మంది నగరవాసులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. తమ పిల్లలతో సహా భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.
నియంత్రించలేని రద్దీ
ఉచిత హలీమ్ కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట వంటి పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అదుపు చేయడానికి హోటల్ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ, జనం భారీగా ఉండటంతో వారు చేతులెత్తేశారు. దీనివల్ల కొండాపూర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: