📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hyderabad iconic cable : హైదరాబాద్‌లో అద్దరగొట్టే కొత్త బ్రిడ్జ్‌.. త్వరలో అందుబాటులోకి!…

Author Icon By Sai Kiran
Updated: November 30, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad iconic cable : హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ బ్రిడ్జి రూపుదిద్దుకోబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన నిధుల మంజూరు పూర్తయింది. టెండర్ల ప్రక్రియ కూడా ముగియడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అంచనాల ప్రకారం వచ్చే ఏడాది చివరి నాటికి ఈ కేబుల్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది.

నగరంలో రోడ్డు కనెక్టివిటీ మరింత మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. చారిత్రాత్మక మీరాలం ట్యాంక్‌పై నిర్మించనున్న ఈ బ్రిడ్జ్ హైదరాబాద్‌కు మరో గుర్తింపుగా నిలవనుంది. ఈ ప్రతిపాదనలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం తెలిపింది. మొత్తం రూ.430 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు.

Read also: Elections: నామినేషన్ రెండో విడత ప్రారంభం

ఈ బ్రిడ్జి నిర్మాణంతో శాస్త్రీపురం నుంచి చింతల్‌మెట్ మీదుగా (Hyderabad iconic cable) బెంగళూరు జాతీయ రహదారి (NH-44) వరకు నేరుగా కనెక్టివిటీ లభించనుంది. దీంతో చింతల్‌మెట్-ఎన్‌హెచ్‌44 మార్గంలో ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొత్తం వ్యయాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) భరిస్తుంది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC) విధానంలో పనులు చేపట్టాలని MRDCLకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూసేకరణతో పాటు టెండర్లు, నిర్మాణ పనులు సమాంతరంగా కొనసాగించాలని స్పష్టం చేసింది.

ప్రాజెక్ట్ నాణ్యత, పర్యవేక్షణ కోసం ఓపెన్ టెండర్ ద్వారా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (PMC) నియామకం చేపడతారు. ఈపీసీ కాంట్రాక్టర్ సమర్పించే డిజైన్‌లను ముందుగా పీఎంసీ, ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ వరంగల్ లేదా జేఎన్‌టీయూ హైదరాబాద్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమై వేగంగా సాగుతున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu cable stayed bridge India Google News in Telugu Hyderabad cable bridge Hyderabad new bridge Hyderabad Traffic Solution iconic bridge Hyderabad Latest News in Telugu Meeralam tank bridge MRDCL project NH44 connectivity Hyderabad Revanth Reddy government Telangana infrastructure project Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.