📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి

Hyderabad: టెస్టీ అట్లాస్ జాబితాలో స్థానం దక్కించుకున్న హైదరాబాద్‌

Author Icon By Anusha
Updated: July 7, 2025 • 2:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ నగరం భారతదేశపు సాంస్కృతిక కేంద్రమైనట్లే కాక, ప్రపంచం మొత్తానికి రుచుల రాజధానిగా నిలిచింది.మొఘలాయి, అరబిక్, టర్కిష్, పర్షియన్ వంటకాలతో హైదరాబాద్ వంటకాలు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాయి. ఇక హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇరానీ చాయ్, దమ్ బిర్యానీ రుచి చూడకుండా ఉండలేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా అవి ప్రాచుర్యం పొందాయి. తాజాగా, హైదరాబాద్ రుచులకు అరుదైన గౌరవం దక్కింది.ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ గైడ్ ‘ టెస్టీ అట్లాస్ ‘ (Testy Atlas) ప్రపంచంలోని వంద ఉత్తమ ఆహార నగరాల జాబితాలో హైదరాబాద్‌కు స్థానం కల్పించింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో 50వ స్థానంలో నిలిచి భాగ్యనగరం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు హైదరాబాద్ వంటకాల నాణ్యత, వైవిధ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. హైదరాబాది బిర్యానీ, హలీమ్, మిర్చీ కా సాలన్ వంటి నగరపు ప్రత్యేక వంటకాలు టెస్టీ అట్లాస్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో నిరంతరం ప్రశంసలు అందుకుంటున్నాయి.

బిర్యానీకి ఉత్తమ

కాగా, హైదరాబాద్ పేరు చెప్పగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే కొన్ని వంటకాల్లో బిర్యానీ మెుదటి స్థానంలో ఉంటుంది. నగరానికి గర్వకారణం ఈ బిర్యానీ. బాస్మతి బియ్యం, మసాలాలు, మాంసం (చికెన్/మటన్) కలిపి దమ్ పద్ధతిలో వండే ఈ బిర్యానీ (Biryani) రుచి అనిర్వచనీయం. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా లభించే ఈ వంటకం, గోధుమలు, మాంసం, పప్పులు, మసాలాలతో నెమ్మదిగా ఉడికించి తయారుచేస్తారు. ఇది పోషకమైనది, రుచికరమైనది. ఇది మిరపకాయలు, వేరుశనగ, నువ్వులు, కొబ్బరి పేస్ట్‌తో తయారుచేసే కూర. బిర్యానీకి ఉత్తమ తోడు. వంకాయలతో చేసే బగార బైగాన్ కూర రైస్‌కు అద్భుతమైన కాంబినేషన్.

Hyderabad: టెస్టీ అట్లాస్ జాబితాలో స్థానం దక్కించుకున్న హైదరాబాద్‌

టెస్టీ అట్లాస్‌

ఎండిన ఆప్రికాట్‌లతో చేసే ఖుబానీ కా మీఠా తీపి వంటకం భోజనం తర్వాత తినడానికి చాలా బాగుంటుంది. బ్రెడ్ ముక్కలను నెయ్యిలో వేయించి, పాలు, చక్కెర సిరప్‌లో నానబెట్టి చేసే తీపి వంటకం డబుల్ కా మీఠా దీన్న చాలా మంది ఇష్టంగా తింటుంటారు. హైదరాబాద్ ఇరానీ ఛాయ్‌తో పాటు ఉస్మానియా బిస్కెట్లు (Osmania Biscuits) ఉండాల్సిందే. అలా అద్భుత వంటకాలతో హైదరాబాద్ టెస్టీ అట్లాస్‌లో చోటు దక్కించుకుంది.ఇలాంటి అంతర్జాతీయ గుర్తింపు వల్ల హైదరాబాద్‌ వంటకాల ప్రాచుర్యం మరింత పెరగనుంది. దీనివల్ల రాష్ట్రానికి టూరిజం అభివృద్ధి, రుచుల పరంగా ఉన్న ప్రాచీనతను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభించనుంది. నలుగురికి మన సంప్రదాయ వంటకాలను చెప్పే అద్భుతమైన వేదికగా టెస్టీ అట్లాస్ మారింది .

Read hindi news:

Read Also: Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమెల్యే సీట్లు: సీఎం రేవంత్

Breaking News GlobalRecognition HyderabadCuisine HyderabadiBiryani IraniChai latest news TasteAtlas Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.