Hyderabad: హైదరాబాద్‌లో భారీ దోపిడీ జరిగింది. దుకాణంలో పని చేసే ఉద్యోగి రూ.1 కోటి విలువ చేసే ఆభరణాలను దొంగిలించాడు. ఎవరికీ అనుమానం రాకుండా రోజూ కొన్ని ఆభరణాలను దొంగిలించాడు.
Read Also: Telangana Thin Rice: సన్న వడ్లకు బోనస్ బకాయిలు విడుదల
పంజాగుట్టలోని జోయ్ అలుక్కాస్ నగల దుకాణంలో పని చేసే ఉద్యోగి అజిత్ ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు వెల్లడైంది. విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో యాజమాన్యం పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది.
ఆభరణాలను ఎత్తుకువెళ్లిన ఉద్యోగిని గుర్తించి యాజమాన్యం పిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడికి ఎవరైనా సహాయం చేశారా? లేక అతడు సొంతంగా చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: