ఇటీవల వరదనీటిలో కొట్టుకుపోయిన మామ అల్లుడు మృతదేహాల్లో(dead bodies) అల్లుడు అర్జున్ మృతదేహం లభ్యమైంది. 13 రోజుల క్రితం హైదరాబాద్ లోని హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్టల్ నగర్ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మామ రాము, అల్లుడు అర్జున్ లు ఆరు బయట నిద్రిస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరదనీటిలో కొట్టుకుని పోయారు. వీరితో పాటు బైక్ లో ప్రయాణీస్తున్న వ్యక్తి కూడా నీటిలో కొట్టుకునిపోయిన విషయం విధితమే. అయితే వారం రోజుల తర్వాత అల్లుడు అర్జున్ మృతదేహం 75 కి.మీ దూరంలోని వలిగొండలో లభించింది.
Read Also: IPS Transfers: టీజీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
కానీ మామ రాము మృతదేహం దొరకలేదు. ఆనాటి నుంచి రాము, బైక్ తో పాటు కొట్టుకుని పోయిన మరో వ్యక్తి కోసం హైడ్రా సిబ్బంది, జీహెచ్ఎం(GHMC) సిబ్బంది కలిసి అన్వేషించినా లభ్యం కాలేదు. కాగా శనివారం ఉదయం నాగోలమూసీలో గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం ఈనెల 14వ తేదీన కొట్టుకుని పోయిన రాముడిగా పోలీసులు గుర్తించారు.
ఘటన ఎక్కడ జరిగింది?
ఈ ఘటన హైదరాబాద్‌లోని హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్టల్ నగర్ ప్రాంతంలో జరిగింది.
ఎంతమంది వరదనీటిలో కొట్టుకుపోయారు?
మొత్తం మూడు మంది వరదనీటిలో కొట్టుకుపోయారు – మామ రాము, అల్లుడు అర్జున్, ఇంకా ఒక బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: